Don't Miss!
- News
తెలంగాణ బీజేపీ ఇంఛార్జీగా సునీల్ బన్సల్: పశ్చిమబెంగాల్, ఒడిశా తర్వాత ఇక్కడ
- Sports
Commonwealth Games : వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్రినుంగాకు అదిరిపోయే వెల్కమ్ చెప్పిన మిజోరం ప్రజలు
- Technology
Snapchat+ సేవల ధర భారత్‌లోనే అత్యంత తక్కువ.. ఎందుకో తెలుసా!
- Finance
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థపై తాజా రిపోర్ట్.. మోర్గాన్ స్టాన్లీ అంచనాలు.. దశాబ్దకాలం..
- Automobiles
కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. అనేక కొత్త మార్పులతో వస్తున్న సరికొత్త హెక్టర్..
- Lifestyle
ఈ కూరగాయలు సహజంగా మీ రక్తంలో చక్కెరను తగ్గించగలవని మీకు తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
Jr NTR: మేనత్త ఉమామహేశ్వరి మృతి అనంతరం ఫస్ట్ టైమ్ వారి ఇంటికి వెళ్లిన తారక్.. ఏం జరిగిందంటే?
సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. మొదట సాధారణ మరణం అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలియడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆమె మృతిపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న సమయంలో నందమూరి హీరోలు అందరూ కూడా ప్రత్యేకంగా ఉమామహేశ్వరికి ఇంటికి వెళ్లే వారి కూతుర్లను భర్తను కూడా పరామర్శిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా అక్కడికి వెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

శోకసంద్రంలో నందమూరి ఫ్యామిలీ
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి హఠాత్తుగా మరణించడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కేవలం నందమూరి ఫ్యామిలీకి మాత్రమే కాకుండా వారి అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఉమామహేశ్వరి మరణించడం వారిని శోకసంద్రంలో ముంచేసింది.

అసలు కారణం?
ఉమామహేశ్వరి పలు అనారోగ్య సమస్యల వలన ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా వారి సన్నిహితులు తెలియజేశారు. అయితే ఈ విషయంలో మాత్రం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఇంకా అధికారికంగా అయితే ఉమామహేశ్వరికి సంబంధించిన మరణం గురించి నిజాలు తెలియలేదు.


ఇటీవల పెళ్లి
కొన్ని నెలల క్రితం ఉమామహేశ్వరి ఇంట్లో పెళ్లి వేడుక కూడా జరిగింది. ఆమె చిన్న కూతురు పెళ్లిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. చాలాకాలం తర్వాత నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ వేడుకలు చాలా హ్యాపీగా పాల్గొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ
ఇక అంతా హ్యాపీగా ఉన్న సమయంలో ఉమామహేశ్వరి ఉరివేసుకొని సూసైడ్ చేసుకోవడం ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఆ మరణ వార్త తెలియగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పుడే వారి ఇంటికి వెళ్లారు. ఆమె పార్థివ దేహానికి ప్రత్యేకంగా నివాళులు కూడా అర్పించారు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉమామహేశ్వరికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు.
|
మేనత్త ఇంట్లో ఎన్టీఆర్
ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ వారిద్దరు కూతుళ్లను కూడా ఓదార్చారు. ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో, మేనత్త ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు ఉమామహేశ్వరికి చాలా సాన్నిహిత్యం ఉండేదట. ఆయన చెల్లెలికి ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండేవారట. ఇక ఎన్టీఆర్ కూడా అదే తరహా ప్రేమతో మెలిగినట్లు తెలుస్తోంది. మేనత్త చనిపోవడంతో ఎన్టీఆర్ కూడా తీవ్ర మనోవేదనకు గురి అయినట్లు సమాచారం.