Don't Miss!
- News
తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bimbisara సెన్సార్ రిపోర్ట్.. కళ్యాణ్ రామ్ ఊచకోత.. మొత్తం సినిమా రన్ టైమ్ ఎంతంటే?
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మొదటి సారి ఒక ఫాంటసీ అడ్వెంచర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో ఎన్నో యాక్షన్ సినిమాల్లో నటించిన కళ్యాణ్ రామ్ ఈసారి ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో సరికొత్త యాక్షన్ తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసారా సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలయితే హై రేంజ్ లోనే ఉన్నాయి.
ఇక మొత్తానికి బింబిసారా సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ఇక ఈ సినిమా రన్ టైం కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. 2 గంటలు 26 నిమిషాల సినిమాగా వెండితెరపై బింబిసార కథను చూపించనున్నారట. ప్రస్తుత కొత్త తరహా కంటెంట్ ను కోరుకుంటున్న ఆడియన్స్ ను రెండు గంటల పాటు ధియేటర్లో కూర్చోబెట్టాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు.

ఇక పెద్దగా ల్యాగ్ అనిపించే సన్నివేశాలు లేకుండా బింబిసారా రన్ టైం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. సినిమా చిత్ర యూనిట్ సభ్యులు అయితే సినిమా ప్రమోషన్స్ లో చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చాలా రోజుల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో వస్తున్న ఫాంటసీ సినిమా కాబట్టి ఆడియన్స్ సరికొత్తగా థ్రిల్ అవుతారని చెబుతున్నారు.
ఇక సెన్సార్ యూనిట్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమాలో కళ్యాణ్ రామ్ ఒకవైపు నెగిటివ్ పాత్రలో మరొకవైపు పాజిటివ్ పాత్రలో కూడా అద్భుతంగా నటించినట్లు చెబుతున్నారు. రెండు కాలాలకు సంబంధించిన అంశాలతో ఈ సినిమా ఆకట్టుకోబోతోందట. ముఖ్యంగా చివరి అరగంటలో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.