Kapil Sharma: కపిల్ శర్మ రెస్టారెంట్‌పై మరోసారి కాల్పులు.. ఎందుకు దాడి చేస్తున్నారంటే?

Kapil Sharma: ప్ర‌ముఖ బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మకి మరో షాక్‌ తగిలింది. కెనడాలోని సర్రే పట్టణంలో ఉన్న ఆయన "క్యాప్స్ కేఫ్" రెస్టారెంట్‌పై మరోసారి దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కేఫ్‌పై దాదాపు 9 నుండి 10 రౌండ్ల బుల్లెట్లు పేల్చారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడకపోయినప్పటికీ, కేఫ్‌ బయట గాజులు పగిలిపోగా గోడలపై బుల్లెట్ రంధ్రాలు కనబడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఇది గత నాలుగు నెలల్లో జరిగిన మూడవ కాల్పుల ఘటన కావడంతో ఆందోళన నెలకొంది.

గతంలో కూడా ఈ కేఫ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై 10, ఆగస్టు 7 తేదీల్లో ఇదే కేఫ్‌పై దుండగులు కాల్పులు జరిగాయి. ఈసారి కూడా అదే తరహాలో దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత దుండగులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు బాధ్యతను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు గోల్డీ ధిల్లాన్, కుల్వీర్ సిద్ధు తమ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు.

Kapil Sharma s Caf in Canada Faces Third Gun Attack Lawrence Bishnoi Gang Claims Role

కుల్వీర్ సిద్ధు తన ఫేస్‌బుక్ పోస్టులో "సర్రేలోని కాప్స్ కేఫ్‌పై జరిగిన మూడు దాడులకు నేను, గోల్డీ ధిల్లాన్ బాధ్యత వహిస్తున్నాం. మాకు సాధారణ ప్రజలతో ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ, మాతో విభేదాలు ఉన్నవారు దూరంగా ఉండాలి. ఇతరుల డబ్బులు తిరిగి చెల్లించని వారు సిద్ధంగా ఉండాలి. బాలీవుడ్‌లో మతాన్ని అవమానించే వారు జాగ్రత్తగా ఉండాలి. బుల్లెట్లు ఎక్కడి నుండైనా రావచ్చు" అని హెచ్చరించారు.

అంతకుముందు, జూలైలో జరిగిన మొదటి దాడికి బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) కార్యకర్త హర్జీత్ సింగ్ లడ్డి బాధ్యత వహించాడు. కపిల్ శర్మ తన కామెడీ షోలో సిక్కులపై "హాస్యాస్పద వ్యాఖ్యలు" చేశాడని, అవి సిక్కు సమాజాన్ని అవమానించాయని లడ్డి పేర్కొన్నాడు. అప్పటి నుండి కపిల్ శర్మపై సిక్కు మిలిటెంట్ గ్రూపులు, గ్యాంగ్‌లు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కెనడాలోని సర్రే పోలీస్ సర్వీస్ (SPS) ఈ సంఘటనను ధృవీకరించింది. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) కూడా దర్యాప్తులో భాగమైంది. పోలీసులు కేఫ్ పరిసరాల్లోని CCTV ఫుటేజీలను సేకరించి, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు, బెదిరింపు సందేశాల ప్రామాణికతను కూడా పరిశీలిస్తున్నారు.

ప్రముఖ మాఫియా గ్యాంగ్‌లలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఒకటి. గతంలో ఈ గ్యాంగ్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను కూడా బెదిరించింది. సిద్ధు మూసేవాలా హత్యకేసులో కూడా ఈ గ్యాంగ్‌ పేరు వచ్చింది. గోల్డీ ధిల్లాన్ ఈ గ్యాంగ్‌ యొక్క కెనడా-అమెరికా కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇటీవల కెనడా ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా కపిల్ శర్మ కేఫ్‌పై మూడోసారి జరిగిన కాల్పుల తరువాత, కపిల్ భద్రతను భారత ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ గ్యాంగ్ సోషల్ మీడియాలో "అతను ఫోన్‌కు స్పందించకపోతే తదుపరి చర్య ముంబైలో ఉంటుంది" అని హెచ్చరించడంతో, బాలీవుడ్ వర్గాలు కూడా భయాందోళనకు గురవుతున్నాయి. ఇక సిక్కు గ్యాంగ్‌ల క్రియాశీలత, బాలీవుడ్ ప్రముఖులపై పెరుగుతున్న బెదిరింపులు కెనడా-భారత సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన ఇటు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X