For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ డైరెక్టర్ ఒళ్ళో కూర్చుని శ్రీరెడ్డి అలా.. ఈసారి పులుసులో ముక్కలు వుండవు...కరాటే కళ్యాణి సంచలనం!

  |

  తెలుగు రాష్ట్రాల్లో కరాటే కళ్యాణి అంటూ తెలియనివారుండరు అనడంలో అతియోక్తి లేదు. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రల్లో ఫేమస్ అయిన కరాటే కళ్యాణి బయట మాత్రం చాలా రెబల్. నిజానికి ఆవిడ పేరు పడాల కళ్యాణి కాగా కరాటేలో శిక్షణ తీసుకున్న కారణంగా ఆమెకు కరాటే కల్యాణి అనే పేరు ఏర్పడింది. స్వతహాగా హరికధా కళాకారిణి అయిన ఆమె తాజాగా నటి శ్రీ రెడ్డి మీదసంచలన వ్యాఖ్యలు చేశారు.

  ఆల్ ఇన్ వన్

  ఆల్ ఇన్ వన్


  తెలుగు సినిమా లో పలు రకాల పాత్రలు పోషిస్తూ దాదాపు ఆమె 120కి పైగా సినిమాల్లో నటించింది. స్వతహాగా హరికథా కళాకారిణి అయిన ఆమె పాటలు కూడా పడుతుంది. మరోపక్క కరాటేలో నైపుణ్యం సంపాదించిన ఆమెకు బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. అలాగే సుదీర్ఘకాలంపాటు హరికథ చెప్పినందుకు గాను ఆమె పేరిట లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా రికార్డు నమోదు అయింది. నటన మీద ఆసక్తితో ఆమె సినిమాల్లోకి వచ్చింది.

  ఆ సినిమాల్లో గుర్తుండే పాత్రలు

  ఆ సినిమాల్లో గుర్తుండే పాత్రలు


  తెలుగులో చత్రపతి, కృష్ణ, మిరపకాయ్, బ్లేడ్ బాబ్జి, గోదావరి, శంకర్ దాదా ఎంబిబిఎస్, గుంటూరు టాకీస్, అదిరిందయ్యా చంద్రం లాంటి సినిమాల్లో ఆమెకు గుర్తుండిపోయే పాత్రలు దక్కాయి. ఇక సినిమాల్లో కాస్త ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో ఆవిడ టీవీ సీరియల్స్ కూడా చేస్తోంది. జీ తెలుగులో ప్రసారం అయిన కొన్ని సీరియల్స్ లో ఆమె నటించింది, నటిస్తోంది కూడా.

  బిగ్ బాస్ ఎంట్రీ - ఎగ్జిట్

  బిగ్ బాస్ ఎంట్రీ - ఎగ్జిట్

  ఇక తెలుగు లో పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా ఆమె ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. అయితే సీజన్ ఫోర్ లో కరాటే కళ్యాణి ఎంటర్ అయిన కొద్దిరోజులకే క్రేజ్ లేని కారణంగా బయటకు వచ్చేయాల్సి వచ్చింది. సాధారణంగా అన్ని విషయాల్లోనూ ఖరాఖండిగా ఉండే కరాటే కళ్యాణి గతంలో శ్రీరెడ్డితో కొన్ని అంశాల్లో విభేదించింది. దీంతో ఆమె బూతుల వర్షం కురిపించగా అవి కేసుల దాకా వెళ్ళింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె సంచలన విషయాలు వెల్లడించింది.

  శ్రీ రెడ్డి

  శ్రీ రెడ్డి ఎందుకు రఘురామ కృష్ణం రాజు, పవన్ కళ్యాణ్ లాంటి వారిని టార్గెట్ చేస్తుందని ప్రశ్నించగా దానికి ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు.
  ఇలాంటి వాళ్లని పట్టించుకుంటున్నాం అని తెలిస్తే వాళ్లు ఏదైనా మాట్లాడతారని పేర్కొన్న ఆమె ఇలాంటి వాళ్ల గురించి మాట్లాడటమే వేస్ట్ అని అన్నారు. వాళ్లకి ఫేమ్ కావాలని వాటిని రకరకాలుగా తెచ్చుకుంటున్నారని ఆన్నారు.

  తనకు ఒక డైరెక్టర్ చెప్పారని, సార్.. నేను లోపలికి రావొచ్చా అని డైరెక్టర్‌ని అడిగి.. వచ్చి అతని తొడపై కూర్చుంటుందని, అలా కూర్చుని ఎక్కడెక్కడో చేతులు వేస్తుందట అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాక అలా చేసి వీడియోలు తీసి కోట్లు కోట్లు డబ్బులు డిమాండ్ చేస్తారని అలా ఆ డబ్బులతో పిల్లి పిల్లల్ని పెట్టి పది ఇళ్ళు తిరిగినట్టు ఇక్కడ తరిమేస్తే అక్కడ.. అక్కడ తరిమేస్తే ఇక్కడకి తిరుగుతూ ఉంటుందని పేర్కొన్నారు. నన్ను రెండు మూడుసార్లు తిట్టింది.. కేసులు కూడా నడుస్తున్నాయి. ఆమె పేరు తీయడం నాకు అనవసం అని పేర్కొన్నారు. ఈ వీడియో షేర్ చేసిన ఆమె ''ఎప్పుడు.... అవుద్దో గానీ. దీనికి. పులుసులో. ముక్కలు. వుండవు. ఆరోజు..జై బజరంగీ'' అంటూ కామెంట్ చేశారు.

  English summary
  Actress Sri Reddy has been in the news for the past couple of years after her shocking sexual abuse allegations against top stars in Tollywood. recently another actress karate kalyani made sensational allegations on sri reddy
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X