Don't Miss!
- News
`ఆ మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది`- మెగాస్టార్..!!
- Finance
Stock Market: బడ్జెట్ కి ముందు లాభాల ప్రారంభం.. కానీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మూడ్ ఇదే..
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
కరణం మళ్లీశ్వరి బయోపిక్.. ప్యాన్ ఇండియా మూవీగా కోన గ్రాండ్ ప్లానింగ్
భారతీయ సినిమా పరిశ్రమలో బయోపిక్స్ హవా కొనసాగుతూనే ఉంది. అజారుద్దీన్, ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ లాంటి జీవితాలు వెండితెరపై ఆవిష్కృతమవుతున్నాయి. ఇప్పటికే సానియా, సైనా నెహ్వాల్, పుల్లెల గోపిచంద్ జీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే కోవలో భారతీయ క్రీడా ప్రతిష్టను విదేశీ గడ్డపై రెపరెపలాడించిన తెలుగు తేజం కరణం మల్లీశ్వరీ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించడానికి రంగం సిద్ధమైంది. జూన్ 1వ తేదీన కరణం మల్లీశ్వరి జన్మదినం సందర్భంగా ఈ సినిమా వివరాలను ప్రకటించారు.
2000లో జరిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా అరుదైన రికార్డును క్రియేట్ చేసిన కరణం మల్లేశ్వరి జీవితాన్ని సినిమా రూపంలో ఆవిష్కరించనున్నారు.

తన కెరీర్‌ను చూసుకొంటే.. వెయిట్ లిఫ్టింగ్‌లో 54 కేజీల విభాగంలో 1994, 1995లో వరల్డ్ టైటిల్‌ను కరణం మల్లీశ్వరి గెలుచుకొన్నారు. ఇంకా ఇస్తాంబుల్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్స్‌లో వెండి పతకం, అలాగే కొరియాలో జరిగిన ఆషియన్ వెయిట్ లిఫ్టింగ్ చాంఫియన్ షిప్స్‌ను గెలుచుకొన్న సంగతి తెలిసింది. తన కెరీర్‌లో 29 ఇంటర్నేషనల్ మెడల్స్, 11 బంగారు పతకాలు గెలుచుకొన్నారు.
ఎంతో మంది దేశీయ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను పాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎంవీవీ సినిమా, కేఎఫ్‌సీ బ్యానర్‌పై నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ, కోనవెంకట్ నిర్మిస్తున్నారు. ఈ బయోపిక్‌ను దర్శకురాలు సంజనా రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్ రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.