twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖైదీ ట్విట్టర్ రివ్యూ: కార్తి అలా ఫీల్ కావాల్సిందే..

    |

    తమిళ హీరో కార్తి నటించిన తాజా సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజే (అక్టోబర్ 5న) విడుదలైంది. డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా చూసి ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ స్పందన తెలుపుతున్నారు. ఆ వివరాలు చూద్దామా..

    చెప్పడానికి మాటలు సరిపోవు

    చెప్పడానికి మాటలు సరిపోవు

    ఖైదీ సినిమా గురించి చెప్పాలంటే బ్రిలియంట్ కంటే బెటర్ వర్డ్ కావాలి. డైరెక్టర్ టేకింగ్, కార్తీ నటన సూపర్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ఇంటర్నేషనల్ స్థాయి సినిమా ఇది అని ఓ ప్రేక్షకుడు ట్వీట్ పెట్టాడు.

    లాంటి డీవియేషన్స్ లేకుండా

    లాంటి డీవియేషన్స్ లేకుండా

    లోకేష్ కనకరాజ్ దర్శకత్వ ప్రతిభ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే సూపర్. కార్తీతో పాటు నటీనటులందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ సినిమా తీశారు. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా అన్ని సన్నివేశాలపై ఫోకస్ పెట్టారు అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

    మాస్టర్ డైరెక్టర్.. కార్తీ నటన

    మాస్టర్ డైరెక్టర్.. కార్తీ నటన

    లోకేష్ కనకరాజ్ మాస్టర్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ఇదొక రేసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మాస్ క్యారెక్టర్‌లో కార్తీ నటన బాగుంది.

    మొదటి నుంచి చివరి దాకా రియాలిస్టిక్‌

    మొదటి నుంచి చివరి దాకా రియాలిస్టిక్‌


    సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఖైదీ. కాస్ట్ అండ్ క్రూ అందరూ బాగా పని చేశారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ కార్తీ చాలా బాగా పండించాడు. మొదటి నుంచి చివరి దాకా ఈ సినిమా రియాలిస్టిక్‌గా ఉంది.

    కార్తీ చాలా ప్రౌడ్‌గా ఫీల్ కావాలి

    కార్తీ చాలా ప్రౌడ్‌గా ఫీల్ కావాలి

    డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మానగరం మాజిక్ రిపీట్ చేశాడు. ఫెంటాస్టిక్ నైట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఫాథర్, డాటర్ ఎమోషన్స్, ఫ్రెండ్ షిప్, బ్రదర్ హుడ్ అన్నీ కూడా హైలైట్ సన్నివేశాలు. కార్తీ చాలా ప్రౌడ్‌గా ఫీల్ కావాల్సిన సినిమా ఖైదీ.

    చూడాల్సిన సినిమా ఖైదీ

    చూడాల్సిన సినిమా ఖైదీ

    ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఖైదీ. కచ్చితంగా అనే పదం గుర్తుపెట్టుకొని మరీ చూడాలి. బ్రిలియెంట్ సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. డైరెక్టర్ ప్రతిభను మెచ్చుకోవచ్చు. ఢిల్లీలో కార్తీ ఎపిసోడ్ చాలా బాగుంది.

    టెక్నికల్‌గా బ్రిలియంట్

    టెక్నికల్‌గా బ్రిలియంట్

    సినిమాలో కార్తీ నటన చాలా బాగుంది. చిత్రంలో చాలా యాక్షన్ సీన్స్ అబ్బురపరిచాయి. హీరోయిన్, పాటలు లేకుండా టెక్నికల్‌గా బ్రిలియంట్ సినిమా రూపొందించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. కెమెరా, ఎడిటింగ్ బాగున్నాయి. ఫస్టాఫ్ ఓకే కానీ, సెకండాఫ్ రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి. బట్ గుడ్ మూవీ.

    English summary
    Kollywood hero Karthi latest movie Khaidi. This movie released friday and getting first talk as.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X