For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీక్రెట్ నిశ్చితార్థంపై పెదవి విప్పిన హీరో కార్తికేయ.. కాబోయే శ్రీమతితో ప్రేమకథ అలా అంటూ!

  |

  టాలీవుడ్లో ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో తెరంగ్రేటం చేసిన కార్తికేయ గుమ్మకొండ ఆ సినిమా ద్వారా అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయారు. అయితే వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాలో కార్తికేయకి మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ ఉదయం కార్తికేయ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది.. దీంతో ఎట్టకేలకు కార్తికేయ తన ఎంగేజ్మెంట్ గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే లవ్ స్టోరీ గురించి కూడా హింట్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

  రెండో సినిమాతో సూపర్ క్రేజ్

  రెండో సినిమాతో సూపర్ క్రేజ్

  ఆర్ఎక్స్ 100 సినిమాలో శివ పాత్ర ద్వారా కార్తికేయ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ప్రేమించి ఒక అమ్మాయి చేతిలో మోసపోయి చివరికి ఆమె చేతుల్లోనే చనిపోయిన పాత్రలో కార్తికేయ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సరిపోతుందేమో. అందుకే ఈ సినిమా ద్వారా కార్తికేయ కు ఎనలేని గుర్తింపు లభించింది. పాయల్ రాజ్ పుత్ కార్తికేయ మధ్య సీన్లు వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా తర్వాత కూడా కార్తికేయ వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి.

  అమ్మాయి ఎవరో తెలియక పోవడంతో

  అమ్మాయి ఎవరో తెలియక పోవడంతో


  అయితే కార్తికేయ వెంట వెంటనే సినిమాలు ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్ గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాలో ఆయన హీరోగా నటిస్తుండగా ఈ సినిమా త్వరలో విడుదలకు కూడా సిద్ధమవుతోంది. అయితే అనూహ్యంగా ఈరోజు ఉదయం కార్తికేయకి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. అయితే ఆ అమ్మాయి ఎవరో తెలియక పోవడంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా కథనాలు వండి వార్చారు.

  బెస్ట్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్

  బెస్ట్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్

  ఇదంతా ఎందుకు వచ్చిందో అనుకున్నాడో ఏమో తెలియదు గానీ కార్తికేయ ఆ అమ్మాయి ఎవరు ఏమిటి అనే వివరాలు తాజాగా వెల్లడించారు. తన బెస్ట్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ అయింది అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను అని చెబుతూ కార్తికేయ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్ లోహిత ఇప్పుడు తన పార్టనర్ కాబోతోందని ఆయన వెల్లడించారు.

  కాలేజి లవ్ స్టోరీ

  కాలేజి లవ్ స్టోరీ

  అలాగే రెండు ఫోటోలు పోస్ట్ చేసిన కార్తికేయ మొదటి ఫోటో తాను మొట్టమొదటి సారి ఆమెను ఎన్ఐటి వరంగల్ లో చదువుకుంటున్నప్పుడు కలిశానని అప్పటి ఫోటో అని పేర్కొన్నాడు. అలాగే రెండో ఫోటో ఇప్పటిదని ఇంకా మాకొన్ని దశాబ్దాల జీవితం ముందుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడమే కాక వరంగల్ లో చదువుకుంటున్నప్పటి అమ్మాయి అనడంతో వారిద్దరిదీ కాలేజి లవ్ స్టోరీ అని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు.

  Recommended Video

  Hero Nikhil ఎమోషనల్.. మిగిలింది అదొక్కటే.. అందరికీ ఇచ్చి పడేశాడు!! || Filmibeat Telugu
  వరుస సినిమాలు

  వరుస సినిమాలు

  ఇక ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత హిప్పీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఆ తర్వాత గుణ 369 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆ తర్వాత నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆయన నెగిటివ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత 90ml, చావు కబురు చల్లగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ప్రస్తుతానికి రాజా విక్రమార్క సినిమాతో పాటు అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వాలిమై సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నాడు. మొత్తం మీద కార్తికేయ ఎంగేజ్మెంట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అని చెప్పక తప్పదు.

  English summary
  Karthikeya has revealed that he is now engaged and wrote on social media "Feeling elated to announce my engagement with my best friend who now is my partner for life''
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X