Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Finance
fpi: ఇండియన్ మార్కెట్ల నుంచి FPIల నిష్క్రమణ.. ఒక్క నెలలోనే అన్ని కోట్లా ??
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Karthikeya's రాజా విక్రమార్క రెడీ.. ఆగలేక పోతున్నామంటున్న డైరెక్టర్!
యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'రాజా విక్రమార్క'. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తి కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ పనుల్లో మేకర్స్ నిమగ్నం అయ్యారు.
ఇక ఈ సందర్భంగా నిర్మాత '88' రామారెడ్డి మాట్లాడుతూ మా 'రాజా విక్రమార్క' కథంతా హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతుందని అన్నారు. ఇందులో గుడిలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయన్న ఆయన కథ ప్రకారం పురావస్తు శాఖ వారు సీల్ వేసిన గుడి అయ్యి ఉండాలని, అదృష్టవశాత్తూ మాకు గండికోటలో అటువంటి గుడి దొరికిందని అన్నారు. ఆ గుడిలోనే దర్భార్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించామని ఆయన వెల్లడించారు. మాకు గర్భగుడి వరకు అనుమతి ఇచ్చారని ఆయన అన్నారు. ఇక మారేడుమిల్లిలో అందరూ చిత్రీకరిస్తున్న లొకేషన్‌లో కాకుండా ఒక యునీక్ లొకేషన్‌కు వెళ్లి, డీప్ రబ్బరు ఫారెస్టులో కీలక సన్నివేశాలు షూట్ చేశామని అన్నారు. ఇక డంప్ యార్డ్‌లో కూడా ప్రీ క్లైమాక్స్ షూట్ చేశామంన ఆయన మేకింగ్ పరంగా ఎక్కడా రాజీ పడలేదని అన్నారు. హీరో కార్తికేయ సహకారంతో సినిమా బాగా వచ్చిందన్న ఆయన పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత, అతి త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం" అని రామారెడ్డి అన్నారు.

ఈ సినిమా దర్శకుడు, వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ "కార్తికేయ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ అవుతుందని, సినిమాలో ఆయన ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపిస్తారని అన్నారు. ఎంటర్టైనింగ్‌గా సాగే యాక్షన్ రోల్‌కు కార్తికేయ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారని అన్నారు. ఇప్పటికే దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ దాదాపు పూర్తవగా రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయని అన్నారు. వీలైనంత త్వరగా సినిమాను మీ ముందుకు తీసుకురావాలని ఉంది" అని శ్రీ సరిపల్లి పేర్కొన్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమా మీద ఆసక్తిని పెంచేసింది. రాజా విక్రమార్క సినిమాలో కార్తికేయ గుమ్మకొండ, తాన్య రవిచంద్రన్ జంటగా నటించగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి, ఫైట్స్: సుబ్బు, నబా, పృథ్వీ శేఖర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ కాంత్ , విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు, సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా, సమర్పణ: ఆదిరెడ్డి. టి, నిర్మాత: '88' రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.