Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వర్మ సెన్సేషన్.. శ్రీ రెడ్డి మాత్రమే కాదు మరో వివాదాస్పద వీరుడు కూడా!
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నవంబర్ 29న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తనలోని విలక్షణతకు మొత్తం బయటపెట్టేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇక ఈయనకు మరో వివాదాస్పద వీరుడు కత్తి మహేష్ కూడా తోడుకావడం జనాల్లో మరింత ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి పోతే..

లైన్ లోకి కత్తి మహేష్.. వర్మ స్టైల్
తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో పాత్రల విషయమై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు వర్మ. ఈ సినిమాతో మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయాలని బలంగా ఫిక్స్ అయిన ఆయన.. పూర్తిస్థాయిలో రెచ్చిపోయి తెరకెక్కిస్తున్నాడు. అందుకే కాంట్రవర్సీ కింగ్ కత్తి మహేష్‌ని కూడా లైన్‌లో పెట్టేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రంలో కత్తి మహేష్ సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

అందరిపై ఫోకస్.. ఏ ఒక్కరూ తక్కువ కాదన్నట్లుగా
రాజకీయ నేపథ్యమున్న సినిమా కావడంతో చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కెఏ పాల్ ఇలా అన్ని క్యారెక్టర్లకు అచ్చు గుద్దినట్లు వారి లాగే ఉండే నటులను ఎంపిక చేశాడు వర్మ. ఇక వారి వారి సంచలన అప్‌డేట్స్ ఇస్తూ వార్తల్లో నిత్యం నిలవడమే గాక రాజకీయ వార్గలకు గుబులు పుట్టిస్తున్నాడు.

పీకే, లోకేష్‌లతో కత్తి మహేష్
ఇదిలా ఉంటే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రంలో నటిస్తున్న పాత్ర దారులతో పార్టీలు చేస్తూ డిఫెరెంట్ ప్రమోషన్స్ చేస్తున్నాడు వర్మ. తాజాగా వర్మ బాటలోనే కత్తి మహేష్ కూడా వెళ్తుండటం చర్చనీయాంశం అయింది. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో నటిస్తున్న పీకే, లోకేష్ పాత్రదారులతో కలిసి పార్టీ చేసుకున్న కత్తి మహేష్.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసేశాడు.
ఫుల్లుగా పార్టీ చేసుకొని అనంతరం..
పీకే, లోకేష్ బాబు పాత్రదారులతో ఫుల్లుగా పార్టీ చేసుకొని కత్తి మహేష్ ఛిల్ అయ్యాడని తెలుస్తోంది. పార్టీ చేసుకున్న తర్వాత వాళ్లతో కలిసి ఫోటోలు కూడా దిగిన కత్తి.. 'పీకే, లోకేష్‌లతో నేను' అంటూ ఫొటోకి క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కత్తి మహేష్. దీంతో ఈ పిక్ వైరల్ అయి.. నెటిజన్ల కామెంట్లకు చిరునామాగా మారింది.

అలీ, శ్రీ రెడ్డి, బ్రహ్మానందం ఇలా అందరూ
అలీ, శ్రీ రెడ్డి, బ్రహ్మానందం, కత్తి మహేష్ ఇలా ఫేమస్ పర్సనాలిటీస్ అందరినీ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రంలో నటీనటులుగా తీసుకున్నాడు వర్మ. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ పలు కాంట్రవర్సీలకు కారణమయ్యాయి. వర్మపై పోలీస్ కేసు కూడా నమోదైంది. చూడాలి మరి నవంబర్ 29 తర్వాత పరితిత్తి ఎలా ఉంటుందనేది.