చిరంజీవి కోసం డోసు పెంచిన డైరెక్టర్: తమిళంలో కంటే హైలైట్‌గా ఉండేలా ప్లాన్

'ఖైదీ నెంబర్ 150' తర్వాత సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి ఆయన యమ స్పీడుగా మూవీలను చేస్తూ దూసుకుపోతున్నారు. దాని తర్వాత పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన 'సైరా: నరసింహారెడ్డి' అనే చిత్రంలో నటించిన ఆయన.. ఆ వెంటనే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో 'ఆచార్య'ను మొదలు పెట్టేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం అనుకున్న సమయానికి షూటింగ్‌ను పూర్తి చేసుకోలేకపోయింది. ఫలితంగా విడుదల వాయిదా పడిపోయింది. అదే సమయంలో దీని ప్రభావం మిగిలిన ప్రాజెక్టుల మీద తీవ్ర స్థాయిలో చూపించింది.

'ఆచార్య' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి ఏకంగా మరో మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో ఒకటి మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్' రీమేక్. దీన్ని కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ షురూ అయింది. అలాగే, తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న 'వేదాళం'ను కూడా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ రూపొందిస్తున్నాడు. వీటితో పాటు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ మరో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Keerthi Suresh Role Highlight in Chiranjeevi Vedalam Remake

చిరంజీవి చేయబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి ఎక్కువగా 'వేదాళం' రీమేక్ మీద పడింది. దీనికి కారణం ఫ్లాప్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన మెహర్ రమేష్‌ను దీని కోసం తీసుకోవడమే. చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టుకున్న ఈ డైరెక్టర్.. చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్న తర్వాత ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నాడు. ఇప్పటికే కోల్‌కతాకు వెళ్లి మరీ ట్రయల్ షూట్‌ను కూడా తీసుకుని వచ్చాడు. దీనితో మెగాస్టార్‌ను మెప్పించాడు. ఇక, ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం అదిరిపోయే బలమైన స్క్రిప్టును కూడా రెడీ చేశాడని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

కోలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌గా పేరొందిన శిరుత్తి శివ తెరకెక్కించిన 'వేదాళం' మూవీలో అజిత్ హీరోగా నటించగా.. అతడి చెల్లెలి పాత్రలో లక్ష్మీ మీనన్ నటించింది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇక, ఇప్పుడు చిరంజీవి చేయబోయే వేదాళం రీమేక్ మూవీలో అతడి చెల్లెలి పాత్రకు మహానటి కీర్తి సురేష్‌ను తీసుకున్నారని ఈ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. తమిళంలో కంటే ఇందులో సెంటిమెంట్ పార్ట్‌ను పెంచాడట మెహర్ రమేష్. దానికి బలమైన భావోద్వేగాలతో కూడిన సీన్స్‌ను కూడా రాసి పెట్టేశాడట.

Keerthi Suresh Role Highlight in Chiranjeevi Vedalam Remake

తమిళంలోనే సెంటిమెంట్ సీన్స్ ఓ రేంజ్‌లో పండాయి. అలాంటి దాన్ని తెలుగులో మరింత ఎక్కువగా పెట్టబోతున్నారన్న వార్త సినిమాపై అంచనాలను మరింత ఎక్కువగా పెంచేస్తోంది. ఇది మెగా అభిమానుల్లో జోష్‌ను నింపేస్తుంది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో తెరకెక్కున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గుండుతో కనిపించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకోసమే ఆయన ఆ మధ్య లుక్ టెస్ట్ కూడా చేసుకున్నారనే టాక్ వినిపించింది. అలాగే, ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటింబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X