twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిలిం మేకర్స్ కు అండగా ప్రభుత్వం.. సొంతంగా ఓటీటీలో లాంచ్?

    |

    కరోనా కంటే ఉందే ఓటీటీలు ఉన్నా ఈ కరోనా పుణ్యమా అని జనం వాటికి అతుక్కుపోతున్నారు. బయటకు వెళ్ళే పని లేకపోవడంతో జనాలు అందరూ ఆయా సినిమాలకు, ఓటీటీలకు అలవాటు పడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రైవేటు ఓటీటీలు అందుబాటులో ఉండగా ఇప్పుడు ప్రభుత్వం ఓటీటీ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

    కేరళ కీలక నిర్ణయం

    కేరళ కీలక నిర్ణయం

    OTT (ఓవర్ ది టాప్) ప్లాట్‌ ఫారమ్‌లు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారాయి. ఈ స్ట్రీమింగ్ యాప్స్ కు ప్రజాదరణ ప్రతి రోజు పెరుగుతోంది. అందుకే చిన్న సినిమాలను ప్రోత్సహించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత ఓవర్ ది టాప్ (OTT) ప్లాట్‌ ఫామ్‌ను ప్రారంభించాలని లేదా ఇప్పటికే ఉన్న ప్లాట్‌ ఫామ్‌ తో కలిసి ఒక దానితో కలిసి పని చేయాలని యోచిస్తోంది.

    ప్రారంభిస్తారా, వాడుకుంటారా?

    ప్రారంభిస్తారా, వాడుకుంటారా?

    "OTT ప్లాట్‌ ఫామ్‌ను సొంతంగా ప్రారంభించే అవకాశాన్ని లేదా ఇప్పటికే ఉన్న ప్లాట్‌ ఫామ్ యొక్క సేవలను అద్దెకు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది" అని సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెరియన్ పేర్కొన్నారు. COVID-19 పరిస్థితిలో, చిన్న బడ్జెట్ సినిమాలను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ప్రభుత్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

    ఆరున్నరకోట్ల ఖర్చు

    ఆరున్నరకోట్ల ఖర్చు

    అది కాక నాటకాలు, స్టేజి షోలతో సహా సాంస్కృతిక కార్యక్రమాలకు తోడ్పడటానికి కూడా మరో ఆన్‌ లైన్ వేదికను ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి చెప్పారు. ఇక మొత్తం రూ .6.5 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్న ఈ ప్రాజెక్టుపై కేరళ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సాఫ్ట్‌వేర్ కోసం త్వరలో టెండర్ ఆహ్వానించబడుతుందని అంటున్నారు.

    అన్ని OTT లలా కాకుండా

    అన్ని OTT లలా కాకుండా

    అయితే ఇతర ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా ప్రభుత్వ OTT సినిమాలను కొనుగోలు చేసి ప్రదర్శించదు. ముందు రిలీజ్ చేసేసి ఆ తరువాత వచ్చే ఆదాయంలో నిర్ణీత శాతం ఫిలిం మేకర్స్ కి వాటాగా ఇస్తారు. ఒక వేళ నిర్ణీత మొత్తంతో ఒక సినిమాని కొనుగోలు చేస్తే దాని కంటే ఎక్కువ ఆదాయం పొందకపోతే, OTT యజమాని నష్టపోతారు. ఒకవేళ మంచి హిట్ అయితే, దాని వలన ఆదాయం పొందితే అది నిర్మాతకు చేరాడు.

    ఆ సమస్యకు పరిష్కారం

    ఆ సమస్యకు పరిష్కారం

    అలా ఇద్దరికీ సమస్య లేకుండా ప్రభుత్వ OTT ఒక పరిష్కారం అని చెప్పచ్చు. ఇక ఈ OTT థియేటర్లు దొరకడం కష్టంగా ఉన్న, అవార్డు గెలుచుకున్న సినిమాలకు ఒక హోప్ అని చెప్పక తప్పదు. మరి ఇలాగే కేరళ ప్రభుత్వం మాదిరిగా మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒక OTT లాంచ్ చేస్తే మంచి స్పందన లభిస్తుందని చెప్పక తప్పదు.

    English summary
    The kerala State government is planning to launch an Over The Top (OTT) platform of its own or run one in collaboration with an already existing platform. to promote smaller films we are planning said Minister for Cultural Affairs Saji Cherian.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X