twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిత్రపురి కాలనీ భూముల కేటాయింపులో భారీ స్కాం జరిగింది: కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

    |

    మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని చిత్రపురి సాధన సమితి డిమాండ్ చేసింది. ఏపీ సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటి లిమిటెడ్ చట్టవిరుద్ధంగా ఈ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారని ఆరోపిస్తూ గత 50 రోజులుగా సినీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వీరికి సంఘీభావం తెలుపుతూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు.

    సినీ కార్మికుల కోసం అప్పటి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన 67 ఎకరాల భూమిని కొందరు స్వార్థపరులైన పెద్దలు ప్రేవేట్ వ్యక్తులకు విక్రయించారని కేతిరెడ్డి ఆరోపించారు. అక్రమాలు జరిగాయని వెంకటేష్ అనే అధ్యక్షుడిని మాత్రమే సస్పెండ్ చేశారు... ఇందులో మీకు సంబంధం లేదా అని పరుచూరి వెంకటేశ్వర్ రావును ఈ సందర్భంగా కేతిరెడ్డి ప్రశ్నించారు. అపరాధి వెంకటేష్‌ మాత్రమే కాదు, అతడితో పాటు కమిటీలో ఉన్న వ్యక్తులు అందరికీ ఇందులో సంబంధం ఉంది కాబట్టి మీరంతా రిజైన్ చేయాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు.

     Kethireddy Jagadishwar Reddy about Chitrapuri Sadana Samithi Movement

    పరుచూరి వెంకటేశ్వరరావు ఆ రోజు ఒక ట్రెజరర్‌గా సంతకంగా చేసింది నిజం కాదా? ఇది కోట్ల రూపాయల స్కాం.. 2300 మంది ప్రైవేట్ వ్యక్తులను 24 క్రాఫ్టుల్లో చేర్చుకుని వారి వద్ద రూ. 5 నుంచి 6 లక్షలు తీసుకుని ఈ కేటాయింపులు చేవారు. 60 శాతం మంది బయటి వ్యక్తులకు కేటాయింపులు జరిగాయి. ఈ 2300 మంది చలనచిత్ర పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తులే అని కేతిరెడ్డి ఫైర్ అయ్యారు.

    ఈ కార్యక్రమంలో బి.జె.పి నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొని చిత్రపురి సాధన సమితి ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ సమస్య ను కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వల దుష్టికి తీసుకెళతానన్నారు. ఈ సందర్భంగా చిత్రపురి సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, నరసింహారెడ్డి, మురళి కృష్ణ తమ సమస్యలు తెలిపారు.

    English summary
    Director Katireddy Jagdishwar Reddy has demanded immediate probe into the irregularities in the allotment of Chitrapuri colony land.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X