జంగిల్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ - రాజమౌళి సినిమా.. అసలు నిజం బయటపెట్టిన నిర్మాత!
సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ప్రకటించిన దాని ప్రకారం అయితే ఇక సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.ఆ తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా గురించి తాజాగా నిర్మాత కొన్ని కీలక అంశాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే

మంచి ఫామ్‌లో మహేష్ బాబు
మహేష్ బాబు వరుస హిట్స్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళితో ఒక సినిమా చేయాల్సి ఉంది.. కానీ రాజమౌళితో సినిమా అంటే ఎప్పటికి పూర్తవుతుందో తెలియని నేపథ్యంలో ఆయన ఈ మధ్యలో త్రివిక్రమ్ తో సినిమా ఖరారు చేసుకున్నాడు.

తర్వాత సినిమా మహేష్ తోనే
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. గతేడాది లాక్ డౌన్ కి ముందు ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో తర్వాత సినిమా మహేష్ తోనే ఉంటుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రోజుకో గాసిప్ వినిపిస్తూనే ఉంది.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా
ఈ మధ్య కాలంలో అయితే ఈ సినిమా అంతా ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా అని, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ కోసం ఓ జంగిల్ అడ్వెంచర్ స్టోరీ లైన్ అనుకుంటున్నారని.. ఆఫ్రికన్ ఫారెస్ట్ లో సినిమా షూటింగ్ కూడా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ఒట్టిదేనని అంటున్నారు. తాజాగా నిర్మాత కేఎల్ నారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ గాసిప్స్ అన్నీ నిజంగా గాసిప్స్ అని తేల్చేశారు.
Recommended Video

నాకే తెలీదు
ఈ సినిమా గురించి బయట వినిపిస్తున్న వార్తలు అంతా నిజం కాదని అన్నారు. అసలు సబ్జెక్ట్ ఏంటి.. ఎక్కడ షూటింగ్ చేయాలి అనేది నిర్మాతని నాకే తెలియదని, అదంతా ఎవరో సృష్టించిన పుకార్లే అని తేల్చి చెప్పారు. స్టోరీ లైన్ మీద రాజమౌళి వర్క్ చేస్తున్నారని, అయితే అది ఇంకా ఫైనల్ స్టేజ్ కి రాలేదని అన్నారు. ఇక మహేష్ - రాజమౌళి కాంబో అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న ఆయన ఈ కాంబో గురించి ఏడేళ్ల క్రితం డిస్కషన్ జరిగిందని అప్పుడు ఈ రేంజ్ లేదని, ఇవాళ రేంజ్ మారినా సినిమా చేస్తున్నట్లు ప్రకటించినందుకు వాళ్లకు రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











