Don't Miss!
- Sports
Team India : సూర్యకుమార్‌పై మరీ ఎక్కువగా ఆధార పడుతున్న టీమిండియా..!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రూ. 500 కోట్లతో గుంటూరులో ఫిల్మ్ స్టూడియో... నిర్మించేది ఎవరో తెలుసా?
తెలుగు సినిమా పరిశ్రకు కేంద్ర బింధువుగా హైదరాబాద్ కొన్ని దశాబ్దాలుగా విరాజిల్లుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు పలు ఫిల్మ్ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు అన్నీ ఇక్కడే నెలవై ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత పరిశ్రమ ఏపీకి తరలిపోతుందనే వార్తలు ఆ మధ్య వినిపించినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు.
అయినా ఇండస్ట్రీని ఒక చోటు నుంచి మరొక చోటుకు తరలించడం అంటే అంత సులభం కాదు. మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు ఇండస్ట్రీ షిప్ట్ అయ్యాక అంతా సెట్టవ్వడానికి కొన్ని దశాబ్దాల సమయం పట్టింది. పైగా హైదరాబాద్‌లో సెటిలైన వారు ఇండస్ట్రీని తరలించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలంగాణ ప్రభుత్వం సహకారం కూడా ఉండటంతో ఇండస్ట్రీ పెద్దలు సంతృప్తిగానే ఉన్నారు.

దీనికి తోడు ఏపీకి తెలుగు సినిమా పరిశ్రమను తరలిస్తే.... ఎక్కడ నెలకొల్పాలి అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు వైజాగ్ కేంద్రంగా ఉంటే బావుందని, మరికొందరు రాజధాని అమరావతికి సమీపంలో ఉంటే బెటర్ అని అభిప్రాయ పడుతున్నారు.
ఇదిలా ఉంటే తెలుగు నిర్మాత కోన వెంకట్ నుంచి తాజాగా ఓ ఆసక్తికర ప్రకటన వచ్చింది. గుంటూరులో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన బాపట్లలో బుధవారం ప్రకటించిననట్లు తెలుస్తోంది. దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో జిల్లాలోని సూర్యలంక ఏరియాలో స్టూడియో నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట.
స్టూడియో నిర్మాణం కోసం కోన వెంకట్ పలు అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లగా వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్‌లోని డిస్నీ థీమ్ పార్క్ తరహాలో దీన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారట. ఏపీ అధికార పార్టీ అండకూడా ఉండటం ఆయనకు మరింత కలిసొచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. కోన వెంకట్ ప్రకటన చేయగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలించాలని బలంగా కోరుకుంటున్న వారిలో కొత్త ఆశలు చిగురించాయి. మరి గుంటూరులో స్టూడియో నిర్మాణం ఏ మేరకు కార్యరూపం దాలుస్తుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.