చిరంజీవి, మోహన్ బాబు మధ్య గొడవలు.. మంచు లక్ష్మి రియాక్షన్ చూడండి ఎలా ఉందో!!
సీనియర్ నటులు మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు నడుమ గొడవలు ఉన్నాయని, కొన్నేళ్లుగా వారిద్దరి మధ్య వైరం నడుస్తోందని ఇన్నాళ్లు కోడై కూశాయి మీడియా వర్గాలు. కొన్ని పబ్లిక్ ఫంక్షన్లలో ఈ ఇద్దరూ మాట్లాడిన తీరు కూడా ఆ వార్తలకు బలాన్నిచ్చాయి. దీంతో చిరంజీవి, మోహన్ బాబు మధ్య గొడవలు నిజమేనని అంతా ఫిక్సయ్యారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో మొన్ననే మళ్ళీ ఈ ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం జనాల్లో చర్చనీయాంశం అయింది. అయితే తాజాగా ఈ ఇష్యూపై మంచు లక్ష్మి ఆసక్తికరంగా స్పందించింది. వివరాల్లోకి పోతే..

భారీ పాపులారిటీ ఉన్న ఇద్దరు సెలబ్రిటీలు.. పబ్లిక్‌గా
చిరంజీవి, మోహన్ బాబు.. ఈ ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులు. అంతేకాదు దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు కూడా. అందుకే ఈ ఇద్దరూ ఒకే వేదికపైకి వచ్చారంటే ఆ కిక్కే వేరు. మరి ఆ ఇద్దరూ పబ్లిక్‌గా ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు కదూ!. ఈ మధ్యే ఆ చూడముచ్చటైన సందర్భం వచ్చిన సంగతి తెలిసిందే.

మా 2020 డైరీ ఆవిష్కరణ.. వార్తల్లో నిలిచిన ప్రముఖులు
2020 ఆరంభం జనవరి 2వ తేదీన హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్ సభ్యులతో పాటు చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు, జయసుధ, రాజశేఖర్, జీవిత, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు హాజరు కావడం, ఆ తరువాత వార్తల్లో నిలవడం చకచకా జరిగాయి.

మోహన్ బాబుకు చిరంజీవి ముద్దులు
ఈ కార్యక్రమంలో 'మా' పై, అలాగే చిరంజీవి సలహాపై రాజశేఖర్ అసహనం వ్యక్తం చేయడంతో వేదిక రసాభాసగా మారింది. ఈ పరిస్థితి గుర్తించిన మోహన్ బాబు.. వేదిక మీద నవ్వులు పూయించేలా జోకులు వేశాడు. దీంతో వెంటనే మోహన్ బాబును ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని చిరంజీవి ముద్దులు పెట్టేశాడు. ఈ పిక్స్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

సోషల్ మీడియాలో మంచు లక్ష్మి.. ఆ ఫోటో షేర్ చేస్తూ
తాజాగా ఇదే పిక్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసిన మంచు లక్ష్మి.. ఈ ఏడాదిలో మొదటి నెల (జనవరి) పూర్తయిందని పేర్కొంటూ కొత్త దశాబ్దం, కొత్త ఏడాది.. నాన్న, చిరు అంకుల్ ఆలింగనం చేసుకున్న ఫోటోలతో ఎంతో అద్భుతంగా ప్రారంభమైందని తెలిపింది.

ఏం జరిగిందో నాకు తెలియదు కానీ.. ఇలాంటి పరిణామం
చిరంజీవి- మోహన్ బాబుల ఆత్మీయ ఆలింగనం తాలూకు పిక్స్ ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు.. కానీ ఆ ఇద్దరూ అలా కలిసి ఒకరికొకరు హత్తుకుని దిగిన ఆ ఫొటోలు చూడగానే నాకెంతో సంతోషం కలిగింది. ఎప్పటినుండో వీరిద్దరి మధ్య గొడవలున్నాయంటూ చాలామంది అనుకుంటున్న సమయంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం సంతోషాన్నిచ్చింది అని మంచు లక్ష్మి పేర్కొంది.

అప్పట్లో చిరు ఫ్యామిలీ.. మా ఫ్యామిలీ
మా చిన్నతనంలో చిరు అంకుల్ వాళ్లు మా ఇంటికి, మేము వాళ్లింటికి వెళ్తుండేవాళ్లం. నాన్న, చిరు అంకుల్ ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అందులో భాగంగా ఆ షూటింగ్ ఎక్కువగా ఊటీలో చిత్రీకరించడం వల్ల మా రెండు కుటుంబాలు సమ్మర్ హాలీడేస్‌ను అక్కడే ఎంజాయ్ చేసేవాళ్లం అంటూ పాత రోజులు కూడా గుర్తుచేసుకుంది మంచు లక్ష్మి.
మంచు వారమ్మాయి అభ్యర్థన
ఒకవేళ నిజంగానే వాళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటే అన్ని సినిమాల్లో కలిసి నటించేవాళ్లా? మీరే చెప్పండి. నిజానికి వారిద్దరి మధ్య ఉన్నది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే. సినీ ప్రేమికులందరూ ఈ విషయం గ్రహించాలి అంటూ అందరినీ అభ్యర్థించింది ఈ మంచు వారమ్మాయి.


Click it and Unblock the Notifications











