For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏ లోకాన ఉన్న శ్రీహరి మమల్ని ఆశీర్వదిస్తారు.. పుష్పరాజ్ ఆడియో ఫంక్షన్లో నిర్మాతలు ఎమోషనల్

  |

  ఆర్‌ యస్ ప్రొడక్షన్స్ ఆర్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై బొడ్డు అశోక్, కే రవీంద్ర కళ్యాణ్ సంయుక్తంగా తెలుగులోకి అనువదిస్తున్న చిత్రం పుష్పరాజ్ ది సోల్జర్. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో, హీరోయిన్లు ధ్రువ సర్జా, రచిత రామ్ హరిప్రియ జంటగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 27న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర ఆడియోను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత రామ సత్యనారాయణ,ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మూవీ మాక్స్ ఆధినేత శ్రీనివాస్, దర్శకుడు సూర్య కిరణ్, ఆదిత్య, తిరుపతి రెడ్డి, పుప్పా అంకంబరావు, రేణుక, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  చిత్ర నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ.. క్రేజీ అంకుల్స్ తర్వాత మా బ్యానర్‌లో వస్తున్న చిత్రం గోల్డ్ మ్యాన్. ఇంకా 10 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మూవీ మాక్స్ ద్వారా పుష్పరాజ్ సినిమాను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తను రీసెంట్ గా విడుదల చేసిన మయోన్ సినిమా గొప్ప విజయం సాధించింది. తిరుపతి రెడ్డి సినిమా తీస్‌మార్ ఖాన్ కూడా బిగ్ హిట్ అవ్వాలి. శ్రీహరి నాకు క్లాస్‌మెట్. తనతో నాకు చాలా అనుబంధం ఉంది. తాను ఏ లోకాన ఉన్నా మమ్మల్ని ఆశీర్వాదిస్తాడని అనుకొంటున్నాను అని అన్నారు.

  నిర్మాత రవీంద్ర కళ్యాణ్ మాట్లాడుతూ.. పుష్పరాజ్ సినిమాను ఆర్ యస్ ప్రొడక్షన్స్ ఆర్ శ్రీనివాస్,గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై బొడ్డు అశోక్ గారితో కలసి తెలుగులో విడుదల చేస్తున్నాం. ఈ నెల 27 న గ్రాండ్ గా విడుదల అవుతున్న మా పుష్పరాజ్ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

  Late Actor Srihari remembered in Pushpa Raj The Soldier pre release event

  మూవీ మాక్స్ ఆధినేత శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీడెడ్, వైజాగ్ ఏరియా లలో బిజినెస్ అయ్యింది. ఇంతకుముందు వచ్చిన పొగరు సినిమాలాగే ఇప్పుడు వస్తున్న పుష్పరాజ్ సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

  నిర్మాత బొడ్డు ఆదిత్య మాట్లాడుతూ..తెలుగు ట్రైలర్ చాలా అద్భుతంగా వచ్చింది. కన్నడలో సూపర్ హిట్ అయిన పుష్పరాజ్ సినిమాను తెలుగులో డబ్ చేసే అవకాశం కల్పించిన రవీంద్ర కళ్యాణ్‌కు ధన్యవాదాలు. అలాగే మా సినిమాతోపాటు రిలీజ్ అవుతున్న తిరుపతి రెడ్డి సినిమా తీస్‌మార్ ఖాన్ సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

  ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్‌లో సక్సెస్ అయి సినిమా రంగంలో కూడా సక్సెస్ అవ్వాలని సినిమాలు తీస్తున్న వ్యక్తి బొడ్డు అశోక్. పుష్పరాజ్ టైటిల్ చూస్తుంటే చార్లెస్ శోభరాజ్, అల్లు అర్జున్ సినిమాలు గుర్తుకు వస్తాయి. హీరో ధ్రువ సర్జాను చూస్తుంటే అర్జున్ వయసులో ఉన్నప్పుడు మా పల్లెలో గోపాలుడు టైమ్ లో ఎలా ఉండేవాడో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆలాగే ఉన్నాడు. అలాగే హీరోయిన్ పిల్లా జమిందార్, బాలకృష్ణ గారితో జై సింహ సినిమాలతో మంచి హిట్ కొట్టిన హరిప్రియ, ధ్రువ సర్జా తో కలసి నటిస్తుంది. ఈ పుష్పరాజ్ సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

  ఈ కార్యక్రమంలో దర్శకుడు సూర్య కిరణ్, అతిధిగా వచ్చిన నిర్మాత రామ సత్యనారాయణ, రేణుక, డైలాగ్ రైటర్ సూర్య, పుప్పా అంకంబరావు, గౌతమ్, రాహుల్, రామకృష్ణ మాట్లాడారు. ఈ నెల 27 తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

  English summary
  Actor Dhruv Sarja's Pushpa Raj The Soldier movie is set to release on August 19th in telugu. In this occassion, Unit organised audio release function in Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X