#LightsCameraJosh.. ఉర్రూతలూగించిన గురుగ్రామ్ సమ్మేళనం.. షిర్లీ సేతియా, MJ5 టాప్ పెర్ఫార్మెన్స్‌తో

షార్ట్ వీడియో యాప్ జోష్ వినూత్నమైన కంటెంట్‌తో దూసుకెళ్తున్నది. వీడియో సంబంధింత యాప్‌లో కంటెంట్‌ను క్రియేట్ చేసే ఔత్సాహికులకు తమ కలలను సాకారం చేసుకోవడానికి జోష్ యాప్‌ వేదికగా నిలిచింది. యూజర్లకు మంచి వినోదాన్ని కల్పించేందుకు టాప్ కంటెంట్ క్రియేటర్లు అతిపెద్ద బ్రాండ్స్‌తో చేతలు కలిపి సరికొత్త ఒరవడిని సృష్టించేందుకు సిద్దమయ్యారు. ప్రతీ ఒక్కరి హృదయాల్లో చోటు సంపాదించుకొన్న జోష్ అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం తెలిసిందే.

#LightsCameraJosh: Shirley Setia, MJ5 rocks Biggest Meetup At Gurugram

అద్భుతమైన కంటెంట్‌తో యూజర్ల మనసులను దోచుకొంటున్న జోష్ సరికొత్త ఈవెంట్లు, వేడుకలతో అందర్నీ ఆకర్షిస్తున్నది. అందులో భాగంగానే #LightsCameraJosh ఈవెంట్‌‌తో ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇటీవల హైదరాబాద్‌లో భారీ సదస్సును నిర్వహించింది. మార్చి 2021, పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు భారీ స్పందన లభించిన నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీన గురుగ్రామ్ మరో భారీ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ సమ్మేళనంలో సుమారు 400 మందికిపైగా కంటెంట్ క్రియేటర్లు పాల్గొన్నారు. ఈ వేడుకకు 20 మిలియన్ క్లౌట్స్ లభించాయి.

#LightsCameraJosh: Shirley Setia, MJ5 rocks Biggest Meetup At Gurugram

#LightsCameraJosh ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించాయి. పాపులర్ డ్యాన్స్ గ్రూప్ MJ5 చేసిన నృత్య విన్యాసాలు అందర్నీ ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని, కంటెంట్ క్రియేటర్ షిర్లే సేతియా, పంజాబ్ గేయ రచయిత, గాయని గుర్నజర్ ఛత్తా ప్రదర్శించిన లైవ్ ఈవెంట్ అనూహ్యమైన స్పందన లభించింది. స్వాతి తివారీ, లవ్లేష్ ఖానేజా, శనయా రవి ఐనాని, రితేష్ పల్, విపిన్ శర్మ పెర్ఫార్మెన్స్‌కు మ్యూజిక్ లవర్స్‌ను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఎంజే5, షిర్లీ సెతియా ప్రదర్శనలు మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు.

#LightsCameraJosh: Shirley Setia, MJ5 rocks Biggest Meetup At Gurugram
#LightsCameraJosh: Shirley Setia, MJ5 rocks Biggest Meetup At Gurugram

#LightsCameraJosh ఈవెంట్‌లో త్రోన్ భాంగ్రా ఫెర్ఫార్మెన్స్‌కు స్పందిస్తూ భల్లే భల్లే అంటూ ప్రేక్షకులు నినాదాలు చేస్తూ వేదిక వద్ద మరింత జోష్ పెంచారు. ఎల్‌ఈడీ లైట్ల ఎఫెక్ట్‌తో ప్రదర్శించిన భాంగ్రా ఫెర్ఫార్మెన్స్‌కు వన్స్‌మోర్ అంటూ ఈలలు పడ్డాయి. టాజ్ జోష్ క్రియేటర్లు వెజీతా, అబ్లూ ప్రదర్శన ప్రతీ ఒక్కరికి కన్నుల పండువగా మార్చింది. 360 డిగ్రీల ఫోన్ బూత్, మ్యాజిక్ మిర్రర్, పాపరాజీ మూవ్‌మెంట్ లాంటి ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. పలు టాప్, బ్లాక్ బస్టర్ పాటలకు ప్రేక్షకులు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు.

#LightsCameraJosh: Shirley Setia, MJ5 rocks Biggest Meetup At Gurugram

#LightsCameraJosh సమ్మేళనంలో స్వాతి తివారీ, ఆస్థా అసిజా, రిడా జావెద్, విజీతా, నూరీన్ షా లాంటి ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. ఈ సమ్మేళనం కేవలం వినోదానికే పరిమితం కాకుండా కొత్త ఆలోచలు, కంటెంట్ క్రియేషన్‌లో కొత్త ఒరవడిని పంచుకొనేందుకు అవకాశం కల్పించింది. అంగరంగవైభవంగా జరిగిన వేడుక అనంతరం కంటెంట్ క్రియేటర్లు, ప్రేక్షకులు గొప్ప అనుభూతిని గుండెల నిండా నింపుకొని ఇంటికి చేరుకొన్నారు.

#LightsCameraJosh: Shirley Setia, MJ5 rocks Biggest Meetup At Gurugram

ఎన్నో మధురానుభూతులు పంచుతున్న ఈవెంట్‌లో భాగస్వామ్యం కావాలనుకొంటున్నారా? జోష్ యాప్‌లో మీరు చేరడానికి ఇంకా ఆలస్యం ఎందుకు? ఒకే ఒక క్లిక్‌తో జోష్ కుటుంబ సభ్యులుగా మారిపోండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X