ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ఒకే ఒక్క వీడియోతో ఎవరూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. మలయాళంలో ఆమె నటిస్తున్న సినిమాలోని కన్నుగీటే క్లిప్ గతేడాది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఇందుకు కారణం. ఆ వీడియో ఎఫెక్టుతో దేశ వ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో కోట్లాది మంది ఆమెను ఫాలో అవుతున్నారు.
ప్రియా వారియర్ నటించిన తొలి చిత్రం తెలుగులో 'లవర్స్ డే' పేరుతో విడుదల కాబోతోంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. ప్రమోషన్లో భాగంగా తాజాగా విడుదల చేసిన రొమాంటిక్ టీజర్ యూత్‌ను టెమ్ట్ చేస్తోంది.
ప్రియా వారియర్ పెదవుల్ని కొరికేశాడు
ప్రియా వారియర్, రోషన్ అబ్దుల్ మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ లిప్ లాక్ వీడియో టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రియా ప్రకాష్ వారియర్ పెదవుల్ని సున్నితంగా కొరుతున్న ఈ సీన్ కుర్రకారును మాంచి మూడ్లోకి తీసుకెళ్లే విధంగా ఉంది.
మూడు నాలుగు భాషల్లో ఒకేసారి
తెలుగు, మలయాళంతో పాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో విడుదల చేస్తున్నారు. డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై అందిస్తున్నారు.
ప్రేమికులకు నచ్చే అంశాలతో
లవర్స్ డే చిత్రంలో మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయి. ప్రేమికులకు నచ్చే విధంగా పాటలు, సన్నివేశాలను మిక్స్ చేసి ఫీల్ గుడ్ మూవీగా దీన్ని రూపొందించారు. ఓ పాట థియేటర్లలో ప్రేక్షకులకు సర్ఫ్రైజ్‌గా ఉంటుందట.
హిట్టయితే ప్రియా వారియర్ దశ తిరిగినట్లే..
‘లవర్స్ డే' చిత్రంలో ప్రియా ప్రకాష్ నటన ఆకట్టుకునే విధంగా ఉండి, సినిమా సూపర్ హిట్టయితే... ఈ వింక్ గర్ల్‌కు తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం. ఈ చిత్రంలో ప్రియా వారియర్‌తో పాటు నూరిన్ షెరిఫ్, రోషన్, మాథ్యూ జోసఫ్, వైశాఖ్ పవనన్, మైఖేల్ యాన్ డేనియల్, దిల్‌రూపా, హరీష్ పెరుమన్న, అనీష్ జి మీనన్, షాన్ సాయి, అర్జున్ హరికుమార్, అతుల్ గోపాల్, రోష్న అన్‌రాయ్ నటిస్తున్నారు.
Teaser of ' Lovers Day ' featuring Priya Prakash Varrier and Roshan Abdul Rahoof. Written and Directed by Omar Lulu, starring a bunch of newcomers. Music by Shaan Rahman, DOP by Sinu Sidharth, Edited by Achu Vijayan, Produced by Guru Raj & Vinod Reddy under the banner of Sukhibhava Cinemas.
Story first published: Wednesday, February 6, 2019, 20:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more