Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Maa Elections: నరేష్ వ్యాఖ్యలపై స్పందించిన నటి హేమ.. ఏం చేయకుండానే కొరికేస్తామా?
ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైన టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల హడావుడి 10 గంటల వరకు ప్రశాంతంగానే కొనసాగింది. పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ , మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ వంటి స్టార్ హీరోలు కూడా ఉదయమే వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆర్టిస్టులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడమే కాకుండా కొట్లాటకు దిగడం ఆశ్చర్యానికి గురి చేసింది. నటి హేమ ఏకంగా ఒక నటుడి చేయి కొరికినట్లు నటుడు నరేష్ ఆరోపణలు చేశారు. ఇక ఆ విషయంపై హేమ కూడా క్లారిటీ ఇచ్చేశారు.

సాదారణ ఎన్నికలను తలపించేలా
గత కొన్ని వారాలుగా మా ఎన్నికల భరిలో ఉన్న వారు ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సాదారణ ఎన్నికలను తలపిస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు పర్సనల్ విషయాలపై కూడా వివదస్పదంగా కామెంట్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి కలిగించింది. మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారు విమర్శలు చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

రిగ్గింగ్ ఆరోపణలతో సీన్ మారిపోయింది
ఇక ఉదయం 10గంటల వరకు కాస్త ప్రశాంతంగా కొనసాగిన మా ఎన్నికలు ఆ తరువాత ఒక్కసారిగా రిగ్గింగ్ ఆరోపణలతో సీన్ మారిపోయింది. కొందరు రిగ్గింగ్ కు పాల్పడినట్లు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ విషయంలో ఎన్నికల అధికారి కూడా హెచ్చరించడం జరిగింది.

చంపేస్తాను అంటూ మోహన్ బాబు
ఓటింగ్ కొద్దీ సేపటి వరకు నిలిపివేయడంతో రంగంలోకి వచ్చిన మోహన్ బాబు ఎన్నికల అధికారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. ఇక అదే సమయంలో సీనియర్ నటుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మోహన్ బాబు చంపేస్తాను అంటూ మరింత కోపానికి లోనయ్యారు. ఆ తరువాత ఇరు వర్గాల మధ్య మాటమాట పెరగడంతో కొంత తోపులాట జరిగింది.

చేయి కోరికిన హేమ.. వీడియోలు ఉన్నాయి
అయితే నటి హేమ, యాక్టర్ శివబాలాజీ చేయి కొరికినట్లు నటుడు నరేష్ ఆరోపించారు. ప్రకాష్ రాజ్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవని అంటూ అయినప్పటికీ కొందరు అదుపుతప్పి ప్రవర్తించారని అన్నారు. హేమ శివబాలాజీ చేయి కొరకడంపై మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక నటి హేమను తాము ఏమి అనలేదని చెప్పినా శివబాలాజీ వీడియోలు కూడా ఉన్నట్లు తెలియజేశారు.
Recommended Video

స్పందించిన హేమ
ఇక నరేష్ వ్యాఖ్యలపై హేమ వెంటనే స్పంధించారు. లోపల చాలా గొడవగా ఉందని అంటూ.. ఆయన ఏం చేయకుండానే కొరికేస్తామా? అని అన్నారు. అంతే కాకుండా ఎన్నికలు అయిపోయాక అన్ని విషయాలపై మాట్లాడుతాను అంటూ హేమ వివరణ ఇచ్చారు. ఇక మా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు తెలిస్తే ఫలితాలు ప్రకటించడం జరగదు అని ఎన్నికల అధికారి
ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు బృందాలను పిలిపించి మాట్లాడారు. అవసరం అయితే కోర్టుకు వెళ్తామని కూడా ఎన్నికల అధికారి తెలియజేశారు.