హృదయం ముక్కలైంది.. దర్శకుడి మృతిపై మాధవన్ ఎమోషనల్
2020లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. సినీ ప్రముఖులు వెంట వెంనటే నేల రాలుతున్నారు. ఈ ఏడాది రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ వంటి దిగ్గజాల మరణంతో మొదలై.. నేటికీ ఎవరినో ఒకరిని బలి తీసుకుంటూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ దర్శకడు నిషికాంత్ కామత్ మరణించారు. అయితే ఈయన మరణ వార్తలపై నిన్న జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ ఉండగానే చనిపోయారనే వార్తలు దావానంలా వ్యాపించాయి.
దీంతో కొందరు సెలెబ్రిటీలు మీడియాపై ఫైర్ అయ్యారు. నిషికాంత్ బతికే ఉన్నారనే విషయాన్ని తెలుసుకోలేక తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయని రితేష్ దేశ్ ముఖ్ వంటి హీరోలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేయ సంబంధింత క్యాన్సర్‌తో బాధపడుతున్న నిషికాంత్ నిన్న రాత్రి ప్రాణాలు విడిచారు. ఈ మేరకు తన దర్శకుడి మృతిపై మాధవన్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించాడు.

మలయాళీ దృశ్యం సినిమాను హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిషికాంత్ మొదటగా మరాఠీలోఓ చిత్రాన్ని చేశారు. నిషికాంత్ మరాఠీలో చేసిన మొదటి చిత్రం డాంబివాలి ఫాస్ట్‌ను తమిళంలో మాధవన్‌తో రీమేక్ చేశారు. మాధవన్ హీరోగా ఎవనో ఒరువాన్ అంటూ తెరకెక్కించగా అది సూపర్ హిట్ అయింది. ఇలా తన దర్శకుడి అకాల మరణంతో మాధవన్ ఎమోషనల్ అయ్యాడు. హృదయం బద్దలైంది.. స్వర్గం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది.. మిమ్మల్ని, మీ పాజిటివ్ నేచర్‌ను ఎప్పుడూ మిస్ అవుతాం మై డియర్ బ్రో. నా కెప్టెన్‌కు ఇదే వీడ్కోలు, ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











