twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mahesh Babu రమేష్ బాబు శాంతిపూజలో మహేష్ బాబు.. కరోనా నుంచి కోలుకొని సోదరుడికి శ్రద్దాంజలి

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొద్ది రోజులుగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్నారు. దుబాయ్ పర్యటనకు వెళ్లి హైదరాబాద్‌కు రాగానే మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన్ మహేష్ బాబు స్వల్ప అనారోగ్యానికి గురికావడం, తదనంతరం రోగ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడంతో కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆయన స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతుండగా.. తన సోదరుడు రమేష్ బాబు ఆకస్మికంగా మృతి చెందడంతో మహేష్ బాబు విషాదంలోకి కూరుకుపోయారు. అయితే కరోనావైరస్ పాజిటివ్ కారణంగా ఆయన రమేష్ బాబు అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది.

    Mahesh Babu attended his brother Ramesh Babus Shraddha Ceremony

    అయితే మహేష్ బాబు కరోనావైరస్ కారణంగా ఆరోగ్య పరిస్థితిని గుట్టుగా ఉంచారు. అయితే ఆయనకు నెగిటివ్ వచ్చిందా? లేదా అనే విషయం అభిమానుల్లో ఆందోళనకు గురిచేసింది. ఇలాంటి సందేహాల మధ్య మహేష్ బాబు తన సోదరుడి మరణానికి సంబంధించిన శాంతి పూజలో పాల్గొన్న ఫోటోలు మీడియాలో లీక్ అయ్యాయి. ఆదివారం రోజున ఘట్టమనేని ఫ్యామిలీ నిర్వహించిన శ్రద్దాంజలి కార్యక్రమానికి మహేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మరింత విషాదానికి గురయ్యారు. తన సోదరుడి ఫోటోను చూసి భావోద్వేగానికి గురయ్యారు అని సన్నిహితులు వెల్లడించారు.

     Mahesh Babu attended his brother Ramesh Babu

    ఇదిలా ఉండగా, నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్‌ షోలో మహేష్ పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమో మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అవుతున్నది. ఇప్పటికే ఈ ప్రోమో 5 లక్షలు వ్యూస్‌ను యూట్యూబ్‌లో సొంతం చేసుకొన్నది. బాలయ్య, మహేష్ బాబు మధ్య జరిగిన ఇంటర్వ్యూ ఎపిసోడ్ ఫిబ్రవరి 4వ తేదిన ప్రసారం కానున్నది.

    మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే.. ఆయన నటించిన సర్కారు వారీ పాట చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్నది. కోవిడ్ పరిస్థితులు, RRR, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే కారణంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

    English summary
    Super Star Mahesh Babu attended his brother Ramesh Babu's Shraddha Ceremony. He is mourning that has been observed in the Ghattamaneni family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X