twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాశ్మీర్ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో మహేష్ బాబు!

    |

    'మహర్షి' మూవీ విజయంతో సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి లాంగ్ యూరఫ్ ట్రిప్ ఎంజాయ్ చేసి ఇటీవలే హైదరాబాద్ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తన తర్వాతి సినిమా 'సరిలేరు నీకెవ్వరు' షూటింగులో బిజీ కాబోతున్నారు.

    ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్‌లో ప్లాన్ చేశారు. ఇందులో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్‌లోని ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలోని రియల్ లొకేషన్లలో షూటింగ్ జరుపబోతున్నారని, ఇక్కడ కొన్ని యాక్షన్ సీన్లు కూడా చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

     Mahesh Babu Sarileru Neekevvaru shooting in Kashmir

    'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. హీరో ఫ్రెండ్ తల్లి పాత్రలో విజయశాంతి కనిపిస్తుందట. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

    ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు.

    విజయశాంతి చివరగా 2006లో వచ్చిన పొలిటికల్ డ్రామా మూవీ 'నాయుడమ్మ'లో కనిపించారు. లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ప్రిపేర్ అవుతున్నారు. రోజూ జిమ్‌కు వెళ్లి వర్కౌట్లు చేస్తున్నారట. ఈ చిత్రంలో ఆమె స్లిమ్ లుక్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.

    English summary
    Mahesh Babu focussed on 'Sarileru Neekevvaru', which has gone on the floors in Kashmir. In the coming days, the superstar will can for a few scenes set against the backdrop of Army cantonments and real locations. A couple of action episodes will be shot on Mahesh and others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X