For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భయపడే వాడే బేరానికొస్తాడు.. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు.. సరిలేరు టీజర్ వైరల్..

  |

  భరత్ అనే నేను, మహర్షి లాంటి వరుస హిట్లతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నాడు. సామాజిక సందేశాలతో కూడుకున్న చిత్రాలను నటిస్తూ... అభిమానులను చైతన్య పరుస్తున్నాడు. అలాంటి సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే లక్కీ చాన్స్ కొట్టేశాడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగిన అనిల్ రావిపూడి ఎఫ్2తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

   టైటిల్‌తోనే పాజిటివ్ రెస్పాన్స్..

  టైటిల్‌తోనే పాజిటివ్ రెస్పాన్స్..

  ఎఫ్2 లాంటి సినిమాను తెరకెక్కించిన అనిల్ రావిపూడి కమర్షియల్ డైరెక్టర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంత వరకు అపజయమన్నదే ఎరుగని దర్శకుడిగా పేరున్న అనిల్.. మహేష్‌తో సినిమా అంటే అన్ని విషయాల్లో ఎంత జాగ్రత్త తీసుకుంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిలేరు నీకెవ్వరు అంటూ టైటిల్ ప్రకటించడంతోనే ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఉండబోతోందన్న విషయం తెలిసిపోయింది.

  పోస్టర్లతో హంగామా..

  పోస్టర్లతో హంగామా..

  సరిలేరు చిత్రం నుంచి దసరా, దీపావళి కానుకలుగా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అభిమానులు మహేష్ బాబును ఎలా చూడాలని కోరుకుంటారో తెలిసిన దర్శకుడిగా అనిల్.. వారికి మంచి ట్రీట్ ఇస్తూ వస్తున్నాడు. ఈ మూవీలో కర్నూలు కొండారెడ్డి బుర్జు ట్రాక్ అదిరిపోతుందని టాక్.

   ప్రత్యేక పాత్రలతో హల్‌చల్..

  ప్రత్యేక పాత్రలతో హల్‌చల్..

  దాదాపు పుష్కర కాలంపాటు సినీ రంగానికి దూరమైన విజయశాంతి.. త్వరలోనే వెండితెరపై వెలగబోతోంది. లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్‌గా పేరు సంపాదించుకున్న ఈ రాములమ్మ ఓ సరైన పాత్రతోనే రీ ఎంట్రీ ఇస్తోందని ఇన్‌సైడ్ టాక్. భారతి పాత్రకు సంబంధించిన విజయశాంతి ఫస్ట్ లుక్ ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బండ్ల గణేష్‌తో కూడా ఓ కీ రీల్ చేయించాడు దర్శకుడు.

  టీజర్‌తో హంగామా చేసేందుకు..

  టీజర్‌తో హంగామా చేసేందుకు..

  టీజర్ లోడ్ అవుతుందని ఏ క్షణాన దర్శకుడు ప్రకటించాడో అప్పటి నుంచి అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తూ వచ్చారు. టీజర్ డేట్‌ను ప్రకటించిన విధానం, రిలీజ్ చేసిన పోస్టర్, అందులో మహేష్ కత్తి లాంటి చూపు ఇలా ప్రతీ ఒక్కటి అంచనాలు పెంచే విధంగానే ఉన్నాయి.

  హైలెట్ అయిన మహేష్ డైలాగ్స్..

  మీరెవరు మాకు తెలీదు.. మీకు మాకు ఏ రక్త సంబంధం లేదు.. కానీ మీ కోసం మీ పిల్లల కోసం పగలు రాత్రి ఎండా వానా..అని లేకుండా పోరాడుతూనే ఉంటాం.. ఎందుకంటే మీరు మా బాధ్యత.. మీరంతా మేము కాపాడుకునే ప్రాణాలురా.. మిమ్మల్ని ఎలా చంపుకుంటామురా, భయపడే బేరానికొస్తాడు.. మన దగ్గర బేరాలేవ్వమ్మా.. అనే పవర్‌ఫుల్ డైలాగ్‌లతో మహేష్ విశ్వరూపం చూపించాడు.

  #CineBox : RRR Update : Olivia Morris Pairup With Jr. NTR In RRR Movie !
  విజయశాంతి, ప్రకాశ్ రాజ్ పంచ్ డైలాగ్‌లు..

  విజయశాంతి, ప్రకాశ్ రాజ్ పంచ్ డైలాగ్‌లు..

  విజయశాంతి ఎమోషనల్‌గా చెప్పిన గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు అనే డైలాగ్.. ప్రకాశ్ రాజ్ చెప్పిన .. ప్రతీ సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు..అనే ఎండింగ్ డైలాగ్ అదిరిపోయింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

  English summary
  Mahesh Babu Sarileru Neekevvaru Teaser Released. This Movies Stars Vijayashanthi, Rashmika Mandanna, Prakash Raj. This Movie Is Going To Relaese On 11th January. this Movie Is Directed By Anil Ravipudi
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X