twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. మహేష్‌బాబు సలహాలు, సూచనలు ఇవే

    |

    లాక్‌డౌన్‌తో కుదేలైన తెలుగు సినీ పరిశ్రమను ఆదుకోవాలని సినీ ప్రముఖులు చేసిన విన్నపానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సానుకూలంగా స్పందించారు. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని ఆయన వెంటనే ఆదేశాలు జారీ చేశారు. సీఎంతో జరిగిన మీటింగ్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పందిస్తూ.

    టాలీవుడ్‌కు తెలంగాణ ప్రభుత్వం హామీ

    టాలీవుడ్‌కు తెలంగాణ ప్రభుత్వం హామీ

    తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు చెప్పిన విషయాలను సావధానంగా విన్నారని, అనంతరం సినీ పరిశ్రమ అభివృద్ధికి, వేతన జీవులకు ఆసరాగా నిలువడానికి ప్రభుత్వం చేయూతనిస్తుందని తెలిపారు. పరిస్థితులను బట్టి సినిమా షూటింగులకు అనుమతులు, థియేటర్ల ఓపెన్‌కు సంబంధించి కొన్ని నిర్ణయాలు అధికారులు, మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సీఎం కేసీఆర్ చెప్పారు.

    మహేష్ బాబు సలహాలు ఇవే

    మహేష్ బాబు సలహాలు ఇవే


    ఇలాంటి పరిస్థితుల్లో సూపర్‌స్టార్ మహేష్ కూడా సినీ ప్రముఖులకు, సాంకేతిక నిపుణులకు సలహా ఇచ్చారు. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని, షూటింగులు, ఇతర కార్యక్రమాల్లో అనుసరించాల్సిన విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకొన్నారు. ప్రతీ ఒక్కరు షూటింగ్ ప్రదేశంలో గానీ.. ఇతర ప్రాంతాల్లో గానీ మాస్కులు ధరించాలని మహేష్ బాబు సూచించారు.

    మాస్క్ ధరించడమే శ్రీరామ రక్ష

    మాస్క్ ధరించడమే శ్రీరామ రక్ష


    ఈ సందర్బంగా తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మనం షూటింగులను ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి మాస్కులు ధరించే విషయాన్ని తప్పనిసరిగా పాటించాలి. మీరు కాలు బయటపెడితే ముఖానికి తప్పకుండా మాస్కు ఉండేలా చూసుకోవాలి. మాస్కులు ధరిస్తే తప్పుకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అంతేకాకుండా ఇతరులను కూడా కాపాడిన వాళ్లం అవుతాం అని మహేష్ సలహాలు ఇచ్చారు.

    నేను మాస్క్ ధరిస్తున్నా.. మీరు కూడా

    నేను మాస్క్ ధరిస్తున్నా.. మీరు కూడా


    కరోనా లాక్‌డౌన్ సమయంలో మనం తీసుకోబోయే నిర్ణయం మన భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. ఇలా ప్రతికూల పరిస్థితులు వెనక్కు నెట్టి సానుకూలమైన జీవితాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మాస్క్ ధరించడమనేది నీకే కాకుండా ఇతరులకు కూడా మేలు చేస్తుంది. నేను మాస్క్ ధరిస్తున్నా.. మీరు ధరిస్తున్నారుగా అంటూ మహేష్ బాబు అభిమానులు, ప్రజలకు సూచించారు.

    English summary
    CM KCR given green Signal to Tollywood shootings within lockdown norms. Telangana Government has showed positive for Telugu Film Industry development. In this occassion, Mahesh Babu given some health tips to Film personalities and common people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X