Mahesh Babu ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్: ఊహించని దాని కంటే ఎక్కువే ఇస్తున్నారట
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. బ్యాంకులను మోసం చేస్తూ విదేశాలకు పరారు అవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ అనివార్య కారణాల రెగ్యూలర్ షూటింగ్ వెంటనే ప్రారంభం కాలేదు. అయితే, ఈ జనవరిలోనే మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా జరుపుకున్నారు. ఇక, త్వరలోనే రాబోతున్న 'సర్కారు వారి పాట' సర్‌ప్రైజ్‌పై తాజాగా ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది.
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న 'సర్కారు వారి పాట' మూవీ నుంచి ఏదైనా సర్‌ప్రైజ్ ఉండబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ సినిమా నుంచి వచ్చేది టీజర్ అని బాగా టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో మహేశ్ బాబు మూవీ నుంచి పోస్టర్‌గానీ, పాట గానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఆరోజున ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాబోతుందట. అంతేకాదు, అది ఫ్యాన్స్ ఊహించని దాని కంటే ఎక్కువ మజాను పంచబోతుందని తెలిసింది.

మరోవైపు, 'సర్కారు వారి పాట' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారని అంటున్నారు. సో.. ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే అది కూడా రివీల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మే 31 కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











