For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పిల్లల కోసం మంచు లక్ష్మీ ముందడగు.. కూతురుతో కలిసి వచ్చేస్తోంది

  |

  టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీది ఓ ప్రత్యేకత. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన మంచు మోహన్ బాబు వారసత్వంగా మంచు విష్ఱు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ వెండితెరపైకి వచ్చారు. అయితే మిగతా ఫ్యామిలీల కన్నా, మిగతా వారసత్వ హీరోలకన్నా కాస్త వెనుకబడ్డారు. ఒకానొకప్పుడు హిట్టు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన మోహన్ బాబు.. తన కొడుకుల విషయంలో మాత్రం తడబడ్డాడు. వీరి కాంబినేషన్‌లో ఎన్ని సినిమాలు చేసినా సత్ఫలితాన్ని ఇవ్వడం లేదు.

  మంచు లక్ష్మీ నటన ప్రత్యేకం..

  మంచు లక్ష్మీ నటన ప్రత్యేకం..

  విజయాలు వరించడం పక్కన పెడితే.. నటనలో మాత్రం అందరూ నిరూపించుకున్నారు. నటనలో ఆ ముగ్గురు వారికి వారే సాటి అని అనిపించుకున్నారు. ఎలాంటి పాత్రైనా అవలీలగా చేసే మంచు లక్ష్మీ ప్రతినాయకురాలి పాత్రలోనూ మెప్పించింది. ఇలా సక్సెస్‌తో నిమిత్తం లేకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారు.

  యూట్యూబ్ చానెల్..

  యూట్యూబ్ చానెల్..

  ఈ క్రమంలో మంచు లక్ష్మీ తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి ఓ యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. పిల్లలు, తల్లిదండ్రులు, నేటి సమాజం, పెంపకం లాంటి విషయాలపై అందరికీ అవగాహన కలిగించేందుకు ఆ చానెల్‌ను ఉపయోగించబోతోన్నట్లు తెలుస్తోంది.

  స్పందించిన మోహన్ బాబు..

  స్పందించిన మోహన్ బాబు..

  మంచు లక్ష్మీ యూట్యూబ్ చానెల్‌పై మోహన్ బాబు స్పందిస్తూ.. ‘పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఎదిగే కొద్దీ వారి మీద పరిసరాల ప్రభావం పడుతుంది. వాటిల్లో మంచి చెడు తెలుసుకోవాలంటే తల్లిదండ్రులు వారి పెంపకం మీద, ఉపాధ్యాయులు, వారి బోధన మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. వయసుతో పాటు పిల్లల ఆలోచనలు, ఆశయాలు, వ్యక్తిత్వం ఎదగాలి. అలా జరగాలి అంటే పిల్లలను తల్లిదండ్రులు ప్రశ్నించనివ్వాలి. ప్రతి ప్రశ్నకు మనం విసుక్కోకుండా సమాధానాలు ఇవ్వాలి. ఎప్పటికప్పుడు పిల్లలకు ఉండే ప్రతి చిన్న అనుమానాన్ని తొలగించాలి.

  తండ్రిగా గర్వపడుతున్నాను..

  తండ్రిగా గర్వపడుతున్నాను..

  ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ఇలా చేయడం ఎంతమంది తల్లిదండ్రులకు సాధ్యమవుతుంది? ఇదే ఆలోచన నా బిడ్డ లక్ష్మిప్రసన్నకి వచ్చి, తన బిడ్డ విద్యానిర్వాణ మరియు చాయ్ బిస్కెట్ సంస్థతో కలిసి చిట్టి చిలకమ్మ పేరుతో ఒక యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభిస్తున్నానని, పిల్లల పెంపకంలో ఉండే ఒక్కో సమస్యకు ఒక్కో episode చేస్తూ, పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా ఆ వీడియోలు ఉంటాయని చెప్పినప్పుడు తనను కన్న తండ్రిగా గర్వపడ్డాను. ఆనందపడ్డాను.

  విజయం సాధించాలి..

  విజయం సాధించాలి..

  ప్రాధమిక జీవిత నైపుణ్యాలతో, తల్లిదండ్రులకు ఉపయుక్తమయ్యే చిట్కాలతో ప్రతీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్స్‌లో ఒక పిల్లల మానసిక వైద్యురాలు కూడా పాల్గొంటారు. ఇవి ఆహ్లాదకరంగా, ఆమోదయోగ్యంగా, ఉపయోగపడేలా ఉండాలని, నా కుమార్తె లక్ష్మిప్రసన్న, నా ముద్దుల మనవరాలు విద్యానిర్వాణ, వారి బృందం చేసే ఈ ప్రయత్నం అద్భుత విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నా'ని తెలిపాడు.

  English summary
  Manchu Lakshmi With Her Daughter Vidya Nirvana Chitti Chilakamma Youtube Channel. Mohan Babu Express His Happiness For Their Initiation For Focussing Child And Parenting Problems.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X