Just In
Don't Miss!
- News
ద్వివేది, శంకర్‌పై బదిలీ వేటు.. 90 శాతం సర్పంచ్ సీట్లు గెలుస్తాం: పెద్ది రెడ్డి ధీమా
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సారీ తమ్ముడు ఇంకొంచెం టైమ్.. మంచు మనోజ్ ట్వీట్ వైరల్
మంచు మనోజ్ సినిమా కెరీర్ ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటాడు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటాడు. ఆ మధ్య విడాకుల వ్యవహారంతో మంచు మనోజ్ నిత్యం వార్తల్లో నిలిచాడు. మళ్లీ తన వ్యక్తిగత పనుల్లో బిజీ అయిపోయాడీ హీరో. మళ్లీ సినిమాల్లో నటిస్తానని, త్వరలోనే ఓ శుభవార్త చెబుతానని ఆ మధ్య ఓ ట్వీట్ చేశాడు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

భార్యతో విడాకులు..
మనోజ్, తన భార్య ప్రణతితో విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. విడాకులతో తన వివాహ బంధం ముగుస్తోందని ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతోనే విడిపోవలసి వస్తుందని.. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం ఉన్నా కలిసి జీవించలేమని రాసుకొచ్చాడు.

కెరీర్‌పై దృష్టి..
ఇక తన వ్యక్తిగతం జీవితంలో ఎదురైన పరిస్థితుల దృష్ట్యా.. తన కెరీర్‌పై అంతగా దృష్టి పెట్టలేదని చెప్పుకొచ్చాడు. అయితే తనకు తెలిసింది సినిమానేనని, మళ్లో సినిమాల్లో నటిస్తానని అందర్నీ ఎంటర్టైన్ చేస్తానని ఓ పోస్ట్ చేశాడు. దీనిలో భాగంగానే మంచు మనోజ్ ఆర్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను కూడా స్టార్ట్ చేశాడు.
|
వారంలో గుడ్ న్యూస్..
‘నేను ఓ అగ్నిగుండంలా ఎగిసిపడేందుకు అంతా రెడీ అయింది.. మరో వారం రోజుల్లో మీకో ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను.. చూస్తూనే ఉన్నండి.. 'అంటూ ఓ ట్వీట్ చేశాడు.

మరింత ఆలస్యం..
అయితే అప్పుడెప్పుడే మంచు మనోజ్ చేసిన ఆ ట్వీట్‌ను చూసి.. తన ఫ్రస్ట్రేషన్‌ను జోడించి ఇంకెప్పుడు అప్‌డేట్ ఇస్తావన్నా.. అంటూ ఓ ఫన్నీ మీమ్‌ను క్రియేట్ చేశాడు. దీనికి మంచు మనోజ్ రిప్లై ఇస్తూ.. క్షమించు తమ్ముడు.. ఇంకొంచెం తమ్ముడు వెయింట్ అంతే.. అంటూ ట్వీట్ చేశాడు.