twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA Elections: కష్టం వచ్చిన ప్రతిసారీ నేనున్నాను.. 'మా' పదవి అంటే కిరీటం కాదు: మోహన్ బాబు

    |

    టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కౌంట్ డౌన్ మొదలు కాబోతోంది అయితే ఈ క్రమంలో అధ్యక్ష పదవికి పోటీకి సిద్ధమైనటువంటి అభ్యర్థులు తీవ్రస్థాయిలో ప్రచారాలను కొనసాగిస్తూ వచ్చారు. ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ఇద్దరు జూడా రాష్ట్ర స్థాయి రాజకీయాలను తలపించేలా ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇక వారితో పాటు మిగతా ఇంటి సభ్యులు కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్లు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

    అంతేకాకుండా సోషల్ మీడియాలో అనేక రకాలుగా మీమ్స్ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. విమర్శలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మా ఎన్నికల విషయంలో ఎవరు వెనక్కి తగ్గడం లేదు. ఎలాగైనా భారీ మెజారిటీతో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇక మోహన్ బాబు ఈ ఎన్నికల విషయంలో మరొకసారి క్లారిటీ ఇస్తూ తన బిడ్డ విష్ణుకి మద్దతు ఇవ్వాలని ఒక ప్రత్యేక నోట్ కూడా రిలీజ్ చేశారు.

    మంచు మోహన్ బాబు లేఖలో ఈ విధంగా వివరణ ఇచ్చారు.. నేను మీ అందరిలో ఒకడిని. నటులతో పాటు నటుడిని. ప్రొడ్యూసర్లతో పాటు ప్రొడ్యూసర్ని అంతే కాకుండా దర్శకత్వ శాఖలో పనిచేసినవాడిని.. ఇక ఇండస్ట్రీలో కష్టం వచ్చిన ప్రతిసారీ నేనున్నాను అని ముందు నిలబడ్డ దాసరి నారాయణరావు గారి అడుగు జాడల్లో నేను నడుస్తున్నాను.. అని తెలియజేశారు.

     manchu mohan babu press release regarding maa elections

    ఇక చేసిన సాయం ఇచ్చిన దానం ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదని దాసరి గారు అంటూ ఉంటాటూ. కానీ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 1982 లో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ స్థాపించిన రోజునుండి కూడా ఈరోజు వరకు ఎన్నో చిత్రాలను నిర్మిస్తూ ఎంతోమంది కొత్త కొత్త టెక్నిషియన్ లను అలాగే కళాకారులని పరిచయం చేసినవాడిని. మన 24 క్రాప్ట్ లలో ఉన్న ఎంతోమంది పిల్లలకి అలాగే స్వర్గస్థులైన ఎంతోమంది సినీ కళాకారుల పిల్లలకి మన విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించడం జరుగుతోంది.

    పేద పిల్లలను చాలామందిని గొప్ప స్థానాలకి చేరేలా చేశాను. ఇకముందూ కూడా అదే తరహాలో కొనసాగిస్తాను. నేను ' మా ' అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడే వృద్ధాప్య పింఛన్లను ప్రవేశపెట్టినవాడిని. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. 'మా' అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు. అది ఒక బాధ్యత. ఇక ఈసారి ఎన్నికలలో నా కుమారుడు మంచు విష్ణు 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు.

    నా బిడ్డ విష్ణు నా క్రమశిక్షణకి, నా కమిట్మెంట్కి కూడా వారసుడు. నా కుమారుడు ఇక్కడే వుంటాడు. ఈ ఊళ్ళోనే వుంటాడు. ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని నేను మాటిస్తున్నాను. కాబట్టి మీరు మీ ఓటుని మంచు విష్ణుతో పాటు పూర్తి ప్యానెల్ కు కూడా వేసి ఒక సమర్ధవంతమైన పాలనకు సహకరించాలని మనవి చేస్తూ.... ' మా ' కుటుంబ సభ్యుడు మోహన్ బాబు అని వివరణ ఇచ్చారు. ఇక మోహన్ బాబు ఎన్నికల అనంతరం. ప్రత్యేకంగా. ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి మా ఎన్నికల సమరంలో మంచు విష్ణు ఎలాంటీ ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

    English summary
    manchu mohan babu press release regarding maa elections..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X