Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
'మా' బిల్డింగ్ అప్పుడే.. టికెట్ల రేట్ల విషయంపై అందుకే స్పందించలేదు: మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఏ స్థాయిలో వివాదస్పదమయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా సినీ ప్రముఖులు ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక మంచు విష్ణు గెలిచిన తరువాత కూడా అదే తరహాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇక చాలా రోజుల అనంతరం మంచు విష్ణు మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో గతంలో వచ్చిన ఆరోపణలపై కూడా మంచు విష్ణు స్పందించారు. అలాగే మా బిల్డింగ్ పై టికెట్ల రేట్ల విషయంపై కూడా విష్ణు వివరణ ఇచ్చారు...

టికెట్ల రేట్ల విషయంలో..
మంచు విష్ణు మా అసోసియేషన్ బాధ్యతలు తీసుకున్న అనంతరం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఎవరికి అంతగా నచ్చలేదు. ఒకేసారి టికెట్ల రేట్లను తగ్గించడంపై విమర్శలు వచ్చాయి. అయితే అప్పుడు మంచు విష్ణు గాని మా అసోసియేషన్ లోని ప్రముఖులు ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు.

క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు
ఇక రీసెంట్ గా మీడియా సమావేశం నిర్వహించిన మంచు విష్ణు ఆ విషయంపై మొదటిసారి స్పందించారు. అలాగే అప్పుడు ఎందుకు స్పందించలేదు అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారని చాలా గోల గోల చేశారు. అయితే ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచింది. ఇప్పుడు ఇది కూడా ఇబ్బందిగా పరిణమించిందని అంటున్నారు. టికెట్ రేట్లు పెరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నేను ముందే గమనించి ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు.. అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

మా బిల్డింగ్ అప్పుడే..
ఇక మా బిల్డింగ్ పై కూడా మంచు విష్ణు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలోనే ఒకసారి మంచు విష్ణు మా బిల్డింగ్ కోసం ప్రత్యేకంగా ఒక అప్డేట్ ఇచ్చారు. మా బిల్డింగ్ కోసం ఇప్పటికే మూడు స్థలాలు చూసినట్లు చెప్పిన విష్ణు కొన్ని నెలల్లో ఎదో ఒక స్థలం ఫిక్స్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక మళ్ళీ చాన్నాళ్లకు విష్ణు ఆ విషయంలో మరో క్లారిటీ ఇచ్చారు.

ఆరు నెలల్లో భూమి పూజ
మా బిల్డింగ్ విషయంలో ఇదివరకే ఒక ప్రత్యేకమైన కమిటీ ద్వారా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ ఆరు నెలల్లో అందుకు సంబంధించిన పనులు కూడా మొదలవుతాయని అన్నారు. ఆరు నెలల్లో భూమి పూజ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పిన మంచు విష్ణు అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే భవన నిర్మాణంలో మిగతా కమిటీ సభ్యుల నిర్ణయాలు కూడా తీసుకుంటామని అన్నారు.

అందరికి ఇన్సూరెన్స్...
ఇక మా కమిటీ సభ్యుల్లో ఉన్న ప్రతీ ఒక్కరికీ కూడా ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నట్లుగా కూడా మా అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పింఛన్ ద్వారా చాలామంది లబ్ది పొందుతున్నారు అని ఇక వీలైనంత త్వరగా మరికొందరికి ఇన్సూరెన్స్ పాలిసీలను జత చేస్తామని తెలియజేశారు. మంచు విష్ణు తీసుకున్నా ఇన్సూరెన్స్ నిర్ణయం చాలా గొప్పది అని నటుడు నరేష్ కూడా వివరణ ఇచ్చారు.