Ramarao On Duty ట్రైలర్ దూకుడు.. రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తున్న మాస్ మహారాజ్
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన హై ఎమోషనల్ ట్రైలర్ ప్రేక్షకుల్లోను, సినీ వర్గాల్లోను భారీ అంచనాలు నింపింది. దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. Rama Rao on Duty మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అభిమానుల కోలాహాలం, విజిల్స్, అరుపులు, కేకల మధ్య ఘనంగా జరిగింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
డ్యూటీ మైండ్ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగిగా రవితేజ సరికొత్తగా విభిన్నమై పాత్రలో కనిపించబోతున్నారు. యాక్షన్, ఎమోషన్స్, రొమాన్స్, పలు అంశాలతో కూడిన రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ట్రైలర్‌లో చూపించిన ప్రకారం.. మైనింగ్‌లో మనుషులు తప్పిపోవడం.. తప్పిపోయిన తన నాన్నను వెతికిస్తారా అనే ఓ పాప ధీనంగా అభ్యర్థించడం సెంటిమెంట్ రేంజ్‌ను తెలిపింది. అన్యాయంపై అధికారి పోరాటానికి రంగంలోకి దిగితే.. పోలీసులు సైతం ఫ్యాన్స్‌గా మారే అవకాశం ఉందనే విషయాలు ట్రైలర్‌లో ఆసక్తికరంగా కనిపించాయి.

నిజాయితీతో కూడిని ప్రభుత్వ ఉద్యోగి అరాచకాలను అడ్డుకోవడానికి రంగంలోకి దిగితే ఏం జరుగుతుందనే అంశాలను ట్రైలర్‌లో దర్శకుడు శరత్ మండవ రుచి చూపించారు. ఓ అధికారి ప్రభుత్వంగా మారితే.. తానే చట్టమైతే శిక్ష ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన పాయింట్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. కేవలం సీరియస్‌గానే కాకుండా ఫ్యామిలీ, రొమాంటిక్, మానవీయ విలువలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.
ఎన్నో ఎమోషనల్ పాయింట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ జూలై 16వ తేదీన రిలీజైంది. గత 24 గంటల్లో 11 మిలియన్ల వ్యూస్ అంటే.. 1 కోటి పదిలక్షల వ్యూస్ సాధించింది.. అదే జోష్‌తో రికార్డు వ్యూస్ సాధించేందుకు పరుగులు పెడుతున్నది.
తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, 'సర్పట్ట'ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
సంగీతం: సామ్ సిఎస్
డివోపీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సి
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పీఆర్వో: వంశీ-శేఖర్


Click it and Unblock the Notifications











