Don't Miss!
- News
హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Ram Charan Upasana: తాత కాబోతున్న చిరంజీవి.. హనుమంతుడి దీవెనలతో అంటూ అఫీషియల్‌గా ప్రకటన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొత్తానికి అభిమానులకు శుభవార్తను తెలియజేశాడు. మెగాస్టార్ చిరంజీవి కొణిదెల ఫ్యామిలీలో మరో తరం వారసులు అడుగుపెట్టబోతున్నట్లుగా అధికారికంగా తెలియజేశారు. ఉపాసన కొణిదెల రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా వారి మొదటి సంతానం విషయంలో అందరికీ గుడ్ న్యూస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఒక ప్రకటన కూడా వెలువడింది. ఆ వివరాల్లోకి వెళితే..

12 ఏళ్ళ తరువాత
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసన కొణిదెల వివాహం జరిగి దాదాపు 12 ఏళ్లు కావస్తోంది. అయితే ఇంకా వారి సంతానం విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు అని గతంలో చాలా రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే మొత్తానికి ఇప్పుడు వారి ఇంట్లోకి మూడవ తరానికి స్వాగతం పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. వారి మొదటి సంతానం విషయంలో అధికారికంగా ప్రకటన వెలువడింది.

గుడ్ న్యూస్ వచ్చేసింది
సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కొణిదెల వారి నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. శ్రీ హనుమాన్ దీవెనలతో ఉపాసన అలాగే రామ్ చరణ్ వారి మొదటి బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్నారు అని అధికారికంగా వివరణ ఇచ్చారు. ఇక అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిపోయింది. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ దంపతులకు ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తాత కాబోతున్నారు
మెగాస్టార్ చిరంజీవికి రామ్ చరణ్ తో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే. ఇక కుమార్తెలిద్దరికీ కూడా కూతుర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ తండ్రి కాబోతూ ఉండడంతో మరోసారి మెగాస్టార్ చిరంజీవి తాత కాబోతున్నారు. అంతేకాకుండా కొనిదెలా ఇంట్లోకి మూడవతరం జనరేషన్ రాబోతోంది. దీంతో వారి ఇంట్లో ప్రస్తుతం ఒక పండగ వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు.

అప్పట్లో ఉపాసన రియాక్షన్
గతంలో చాలాసార్లు రామ్ చరణ్ తేజ్ ఉపాసన మొదటి సంతానం పై అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో మధ్యలో ఉపాసన కూడా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడు పిల్లలను కనాలి అనేది తమ నిర్ణయం అని ఆ విషయంలో కూడా ఎందుకు మిగతా వాళ్ళు కామెంట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని కొంత అసహనం వ్యక్తం చేశారు.

ఫ్యాన్స్ హ్యాపీ
ఇక ఇప్పుడు మొత్తానికి రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా వారి మొదటి సంతాన విషయంలో ఒక నిర్ణయానికి రావడం ఫాన్స్ అందరిని కూడా ఎంతో ఆనందానికి కలుగజేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత కాబోతున్నారు అనే వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ శంకర్ సినిమాతో బిజీగా ఉండగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే.