twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pawan Kalyan పాలిటిక్స్ పై మెగాస్టార్ కామెంట్.. అక్కడ రానించడం చాలా కష్టం అంటూ..

    |

    మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయాలపై మరోసారి ఊహించిన విధంగా స్పందించారు. ఇదివరకే ఆయన కొన్నిసార్లు పవన్ రాజకీయాల్లో ఉండే విధానం పై చాలా పాజిటివ్గా స్పందించిన విషయం తెలిసిందే. మొదట్లో అయితే వీరి మధ్య విబేధాలు ఉన్నాయని చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. కానీ ఎప్పుడైతే మెగాస్టార్ పవన్ పాలిటిక్స్ పై వివరణ ఇచ్చారు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇటీవల మరోసారి చిరు స్పందించిన విధానం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    గతంలోనే క్లారిటీ

    గతంలోనే క్లారిటీ

    గతంలో మెగాస్టార్ పవన్ రాజకీయాలపై స్పందిస్తూ.. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలన్నది తన కోరికని ఒకవేళ అలాంటి వాళ్ళు వస్తే రాజకీయాలకు మంచి జరుగుతుంది అంటే తప్పకుండా నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది అని కూడా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పేశారు. ఒక విధంగా మెగా అభిమానులకు ఆ విషయం ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది.

     ఆత్మీయ సమావేశంలో

    ఆత్మీయ సమావేశంలో

    అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వైఎన్ఎం కాలేజ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఇక సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆ సమావేశం గురించి మాట్లాడిన మెగాస్టార్ తన స్నేహితుల గురించి కూడా ఎన్నో సరదా విషయాలను గుర్తుచేసుకున్నారు.

    పవన్ పాలిటిక్స్

    పవన్ పాలిటిక్స్

    అయితే ఈ క్రమంలో తన రాజకీయాలపై స్పందిస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలకులపై కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చిరంజీవి మాట్లాడుతూ సాధారణంగా నేను ఏదైనా అనుకుంటే దాని అంతు చూసే వరకు వదలను. కానీ అది నా మనసులో నుంచి రాకపోతే మాత్రం అంతూ చూడలేను. ఆ విధంగా నేను చూడలేకపోయినా విషయం ఏంటో మీకు తెలుసు.. అని పాలిటిక్స్ పై చిరు చెప్పారు.

    అందుకు తగిన వ్యక్తి పవన్

    అందుకు తగిన వ్యక్తి పవన్

    మళ్ళీ అక్కడి నుంచి నేను వెనక్కి వచ్చేసాను. అక్కడ రానించడం అనేది చాలా కష్టమైంది. సున్నితంగా ఉండకూడదు. చాలా మొరటుగా గట్టిగా ఉండాలి. అన్నా అనకపోయినా ఎన్నో మాటలు అంటూ ఉండాలి. అనిపించుకోవాలి. అందుకే ఇదంతా అవసరమా అని చాలాసార్లు అనుకున్నాను. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు తగిన వ్యక్తి అని అనిపించింది.. అని అన్నారు.

     పవన్ ను అత్యున్నత స్థానంలో

    పవన్ ను అత్యున్నత స్థానంలో


    తను ఏదైనా సరే తెగించగలడు. అంటాడు.. అనిపించుకుంటాడు. అలాంటి వ్యక్తులకి మీరందరి సహకారం ఉంటుంది. అలాగే మీ ఆశీర్వాదం కూడా తోటి వారి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. ఏదో ఒక రోజు పవన్ ను అత్యున్నత స్థానంలో చూస్తాము అని కూడా ఆయన నమ్మకంగా తెలియజేయడం.. మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

    English summary
    Megastar chiranjeevi clarification on pawan kalyan politics
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X