మెగాస్టార్ ఘరానా మొగుడు రికార్డ్ ఏంటో తెలుసా? ఇండియాను షేక్ చేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాతున్నారు. ఇప్పటికీ బాస్ తన అభిమానుల కోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తూనే ఉన్నారు. 48 ఏళ్లుగా చిరంజీవి హీరోగా అలరిస్తున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తుండటం విశేషం. యాక్షన్, డ్రామా, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన చిత్రాలతో అలరిస్తున్నారు. నెక్ట్స్ రాబోయే చిత్రాలపై మరింతగా శ్రద్ధ వహిస్తున్నారు. కాగా చిరంజీవి 69వ పుట్టిన రోజు సందర్భంగా బాస్ రికార్డ్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ ఫిల్మ్ ఘరానా మొగుడు సెట్ చేసిన రికార్డుల విషయానికొస్తే..
1992లో టాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రం ఘరానా మొగుడు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో పోషించారు. కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈచిత్రంలో హీరోయిన్లుగా నగ్మా, వాణీ విశ్వనాథ్ నటించారు. ఇక కీలక పాత్రల్లో రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, రమాప్రభ, చలపతిరావు నటించారు. ఇక ఈ చిత్రంలో డిస్కో శాంతి నటించిన బంగారు కోడిపెట్ట సాంగ్ ఇప్పటికీ సంగీత ప్రియులకు ఫేవరెట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రాన్ని దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ లో కనకమేడల దేవీ, వరప్రసాద్ నిర్మించడం విశేషం.

ఘరానా మొగుడు చిత్రం విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్లు వసూల్ చేయడం విశేషం. 3 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం రూ.10 కోట్ల వరకు వసూళ్లు అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేయింది. మొట్టమొదటగా 10 కోట్ల రూపాయల గ్రాస్ అందుకున్న చిత్రంగా మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాదు ఈ చిత్రంతో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డ్ సెట్ చేశారు. దాదాపు 2 కోట్ల రూపాయాల రెమ్యునరేషన్ అందుకున్నట్టు సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఆ రోజుల్లోనే ఇంతలా రెమ్యునరేషన్ అందుకునింది ఇండియాలో ఒకరు ఇద్దరు మాత్రమే. ఇక టాలీవుడ్ నుంచి చిరంజీవి ఆ రికార్డ్ ను సెట్ చేశారు.
అంతే కాదు ఘరానా మొగుడు చిత్రం మలయాళంలో హే హీరోగా, తమిళంలో మన్నన్ గా రీమేక్ చేయడం విశేషం. ఈ చిత్రంలో చిరంజీవి అటిట్యూడ్, బాడీ లాంగ్వేజీ, డైలాగ్స్, మాస్ అన్నీ సెన్సేషన్ అనిపించాయి. ఇప్పటికీ చిరంజీవి అభిమానులు చిరంజీవి ఘరానా మొగుడు చిత్రాన్ని ఎంతగానో ఇష్టపడుతుంటారు ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి అప్పట్లోనే అద్బుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని బంగారు కోడిపెట్ట సాంగ్ ను, రామ్ చరణ్ ఎస్ఎస్ రాజమౌళి మగధీర చిత్రంలో రీమేక్ చేయడం విశేషం.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక విశ్వంభర చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్ కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని మల్దిడి వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. హీరోయిన్ గా త్రిష క్రిష్ణనన్ మరోసారి చిరంజీవి సరసన నటిస్తోంది.


Click it and Unblock the Notifications











