పావలా శ్యామలకి మెగాస్టార్ సాయం.. నెల నెలా ఇబ్బంది లేకుండా కీలక నిర్ణయం!
తెలుగు సినీ జగత్తులో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్నారు. సామాన్యుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి అసామాన్యుడిగా ఎదిగిన చిరు, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా మారారు. వివాదాలు, విషాదాలు, సమస్యలు, సంబరాలు ఏవి వచ్చినా అన్నింటిలో తానే ముందుండి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా కాదనకుండా వస్తున్నాడు.. తనవంతు సాయం చేస్తున్నాడు. తాజాగా టీఎన్ఆర్ మరణించగా ఆయన కుటుంబానికి సహాయం చేసిన చిరు ఇప్పుడు మరలా పావలా శ్యామలకి కూడా అండగా నిలబడ్డారు.
రెండు రోజుల నుంచి పావలా శ్యామలకి సంబంధించి సోషల్ మీడియా, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో పావల శ్యామల ఉపాధి లేక ఈ కష్టకాలంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి మరోసారి సాయం చేశారు. ఆయన పావల శ్యామలకు మా తరపున సభ్యత్వ కార్డ్ తీసుకునే నిమిత్తం మంగళవారం నాడు లక్షా పదిహేను వంద;a రూపాయల చెక్ పంపించారు.

ఈ చెక్ ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ సభ్యులు కరాటే కళ్యాణి, సురేష్ కొండేటి స్వయంగా శ్యామలకి అందించారు. ఇకపై కొత్త సభ్యురాలైన పావలా శ్యామలకి 'మా' మెంబర్ షిప్ కార్డ్ తో నెలకు 6 వేల చొప్పున ప్రతినెలా పెన్షన్ రూపంలో 'మా' అందించడం జరుగుతుంది. ఇక ఈ సభ్యత్వం తీసుకున్న ఆర్టిస్ట్ ఎవరైనా అకాలమరణం చెందితే వారికి 3లక్షల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ఈ సందర్బంగా పావల శ్యామల మాట్లాడుతూ గతంలో కూడా చిరంజీవి గారు 2లక్షల ఆర్థిక సాయం చేశారని చెప్పుకొచ్చారు. అప్పుడు తాను ఎంతో కష్టంలో ఉన్నానుని అప్పుడు ఆ రెండు లక్షల ఆర్థిక సాయం నన్ను ఎంతో ఆదుకుందని అన్నారు. ఇప్పుడు ఈ కష్టంలో మరోసారి సాయపడిన వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











