For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiranjeevi meeting with YS Jagan: సినీ ప్రముఖులతో బిజీ బిజీగా మీటింగ్.. ఎజెండాపై కసరత్తు

  |

  కరోనా వైరస్ లాక్ డౌన్ వలన సినిమా పరిశ్రమలకు ఏ స్థాయిలో దెబ్బ పడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ స్థాయి అంతకంతకూ పెరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా థియేటర్ బిజినెస్ కూడా డౌన్ అయ్యింది. దీంతో సినిమాలు చాలా వరకు ఓటీటీ వైపు వెళ్ళాక తప్పలేదు. అనంతరం కొన్ని థియేటర్స్ కూడా షాపింగ్ మాల్స్ మాదిరిగా మారే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని సినిమాల పై ఆధారపడ్డ కుటుంబాలు ఎంతో కొంత ధైర్యంగా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్ల తగ్గింపు వలన మళ్ళీ అందరూ కంగారు పడ్డారు. కొత్త జీవో రావడం పై సినీ పెద్దలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే అలాగే మరికొన్ని సమస్యలతో కూడా తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

  ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పలుమార్లు చర్చలు జరిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ప్రత్యేకంగా కలుసుకోని వివరణ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోనే మరికొన్ని రోజుల్లో ఏపీ సీఎంతో సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు భేటీకానున్నారు. అందుకోసం మెగాస్టార్ చిరంజీవి ముందుగానే పక్క ప్లానింగ్ తోనే సిద్ధమవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై అలాగే టిక్కెట్ల రేట్లపై కూడా ముందుగానే ఒక నిర్ణయానికి రాబోతున్నట్లు సినీపెద్దలతో ఇటీవల మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ హైద‌రాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలోనే జ‌రిగింది.

  సినీ కార్మికులకు అండగా మెగాస్టార్

  సినీ కార్మికులకు అండగా మెగాస్టార్

  సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన సమస్యల పైన ఎప్పటికప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినీ పెద్దగా ముందడుగు వేస్తూ అందరికి మద్దతుగా నిలుస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సహాయలు చాలానే ఉన్నాయి. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు అండగా నిలిచిన విషయం తెలిసిందే.

  పేద కళాకారులలో ఆకలితో ఉన్నవారికి కూడా మెగాస్టార్ నిత్యవసర వస్తువులను సమకూర్చే సహాయం చేశారు. మెగా స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా ఆ సేవలో పాల్గొన్నారు. మిగతా మెగా హీరోలు కూడా వారి వంతు కృషి చేసి అభిమానుల కోసం విరాళాలు అందించారు.

  ప్రజల కోసం కూడా ఎన్నో సహాయలు

  ప్రజల కోసం కూడా ఎన్నో సహాయలు

  అంతేకాకుండా కరోనా వైరస్ తో ఇబ్బంది పడే చాలా మంది రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్స్ అందిస్తూ తన మంచి మనసు ఏమిటో మరోసారి నిరూపించారు. మెగాస్టార్ సేవలు కేవలం ఇండస్ట్రీలోవారి కోసమే పరిమితం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు జనాల కోసం కూడా ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు.

  ప్రతి గ్రామంలో ఉన్న వారికి ఆక్సిజన్ సిలిండర్స్ సమయానికి అందేలా కృషి చేశారు. ఆ సేవ మార్గంలోనే అభిమానులు కూడా మెగాస్టార్ చిరంజీవికి ఎంతగానో సహాయపడ్డారు.

  మెగాస్టార్ చిరంజీవి కి ఫోన్ చేసి

  మెగాస్టార్ చిరంజీవి కి ఫోన్ చేసి

  ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఇండస్ట్రీకి ఎంతోకొంత ఉపయోగపడే విధంగా అడుగులు వేయబోతున్నారు. గత ఏడాది నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా వివరించాలని ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. ఇటీవల మంత్రి పేర్ని నాని డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి కి ఫోన్ చేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో పాల్గొనవలసిందిగా కోరారు. సినిమా ఇండస్ట్రీలో సమస్యలపై కూడా వివరణ ఇవ్వాలని తెలిపారు.

  టిక్కెట్ల ధ‌ర‌లు ఎలా ఉండాలి..?

  టిక్కెట్ల ధ‌ర‌లు ఎలా ఉండాలి..?

  ఇక ఆ మీటింగ్ కోసం మెగాస్టార్ చిరంజీవి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్స్ టిక్కెట్ల రేట్లపై కొత్త నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి వినతిపత్రాన్ని అందించబోతున్నారు. వీలైనంత త్వరగా ఆ విషయంలో సానుకూలమైన సమాధానం వచ్చేలా చేయాలని అనుకుంటున్నారు.

  కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న థియేటర్స్ టికెట్ల రేట్లను భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. ఇక గ్రామ పంచాయితీ, న‌గ‌ర పంచాయితీ, కార్పొరేష‌న్ ఏరియాల్లో టిక్కెట్ల ధ‌ర‌లు ఎలా ఉండాలి ఆ సమస్యలపై ఎలా అడగాలి? చిన్న సినిమాల మనుగడకోసం ఐదో షో విషయంపై కూడా ఈ మీటింగ్ లో చర్చించుకోవడం జరిగింది. ఇప్పటికే తెలంగాణలో ఐదో షో కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

  వివిధ రకాల సమస్యల గురించి

  వివిధ రకాల సమస్యల గురించి

  చిన్న నిర్మాత‌ల స‌మ‌స్య‌ల‌పైనా కూడా ఏపి సీఎంతో భేటీలో చ‌ర్చించ‌నున్నారు. ఇక ఇండస్ట్రీలో నెలకొన్న అసంతృప్తిలపై సానుకూల వాతావరణం వచ్చేలా అలాగే అవన్నీ ఓ కొలిక్కి వచ్చేలా రిక్వెస్ట్ చేయాలని వివరణ ఇవ్వనున్నారట. అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అన్ని భాగాల్లో ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల గురించి కూలంకుషంగా చర్చించడం జాతిగిందట. సమస్యలు పరిష్కారం కోసం కూడా ముఖ్యమంత్రి నుంచి సమాధానం కోరాలని చర్చించుకోవడం జరిగింది.

  కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు

  కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు

  ఈ కార్యక్రమంలో ఫిలిం చాంబ‌ర్ అధ్య‌క్షులు నారాయ‌ణ దాస్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్ . రామారావు , దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్ , సి. కళ్యాణ్, ఎన్వి. ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ భోగవల్లి బాబీ యూవీ క్రియేషన్స్ విక్కీ - వంశీ ఇలా..నిర్మాత‌ల సంఘం.. పంపిణీ, ఎగ్జిబిష‌న్ రంగాల నుంచి ప్ర‌తినిధులు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు.

  English summary
  Megastar chiranjeevi special meeting with andhra pradesh cm ys jagan mohan reddy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X