Don't Miss!
- Sports
SA20 League: శతక్కొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. తొలి ప్లేయర్గా రికార్డు!
- News
ఆ నియోజకవర్గాల్లో వైసీపీదే హవా, కానీ - తాజా సర్వేలో కీలక అలర్ట్స్..!?
- Finance
Gautam Adani: ఆ వ్యసనానికి బానిసైన గౌతమ్ అదానీ..! ఒప్పుకున్న బిలియనీర్..
- Automobiles
అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న TVS iQube: ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం..
- Lifestyle
Chanakya Niti: ఈ వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగొద్దు, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Waltair Veerayya: అఫీషియల్ గా సాంగ్ లీక్ చేసిన మెగాస్టార్.. శ్రీదేవితో చిరంజీవి అంటూ..
మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడు ఊహించిన విధంగా తొందరపాటులో తన సినిమాలకు సంబంధించి కొన్ని విషయాలు లీక్స్ చేయడం వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే అది సరదాగా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ కూడా ఇందులో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇక బ్యూటిఫుల్ హీరోయిన్ శృతిహాసన్ మెగాస్టార్ చిరంజీవి కి జోడిగా కనిపించబోతోంది. అయితే ఈ సినిమా సాంగ్ షూటింగ్ కోసం ఇటీవల మెగాస్టార్ ఫ్రాన్స్ కు వెళ్లారు. అయితే అక్కడ మంచు కురుస్తున్న సమయంలో షూటింగ్ చేయడం జరిగిందట. ఇక సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు మెగాస్టార్ స్వయంగా అక్కడి మంచు కురుస్తున్న షాట్స్ ను వీడియో తీసి షేర్ చేసుకున్నారు. దాదాపు మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో ఈ షూట్ ను కంప్లీట్ చేయాల్సి వచ్చింది అని అందరూ కూడా ఎంతో గాను కష్టపడినట్లు కూడా మెగాస్టార్ తెలియజేశారు.

చలి ఎంత ఉన్నా కూడా మిమ్మల్ని అలరించేందుకు నేను ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాను అని కూడా మెగాస్టార్ తెలియజేయడం ఫ్యాన్స్ ను ఎంతగానో నచ్చింది. ఇక ఈ సినిమాలోని పాట మాత్రం తప్పకుండా మీ అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకుంటుంది అని కూడా ఆయన అన్నారు. వీడియో చివర్లో మెగాస్టార్ ఉహించని విధంగా మీకు సాంగ్ గురించి కొంత లీక్ చేయాలని అనుకుంటున్నాను అని ఒక బిట్ ను ఆ వీడియోలో జత చేశారు. నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి అంటూ సాగే ఆ సాంగ్ అద్భుతంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక ఈ సాంగ్ కూడా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది అని మెగాస్టార్ తెలియజేశారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. ఇక అదే సమయంలో నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మరి ఆ రెండు సినిమాల్లో ఏ సినిమా అత్యధిక కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.