Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఏపీ పాలిటిక్స్ లో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఎవరికంటే.. కుండబద్దలు కొట్టిన చిరంజీవి.. పవన్ కు షాక్!
మెగాస్టార్ చిరంజీవి గత కొంతకాలంగా గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఇంటర్వ్యూలలో చేస్తున్న కొన్ని కామెంట్స్ కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక రాజకీయ అంశాలపై కూడా అప్పుడప్పుడు స్పందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ తదుపరి ఎన్నికలలో మెగా ఫాన్స్ సపోర్ట్ ఎవరికి ఉంటుంది అనే విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కు పెద్ద షాక్ ఇచ్చారు అని కూడా అనిపిస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ప్రమోషన్స్ లో బిజీగా..
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. బాబీ దర్శకత్వంలో మాస్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన వరుస ప్రమోషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి చాలా బిజీగా మారిపోయారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు రాజకీయ అంశాలపై కూడా స్పందించడం విశేషం.

మెగా చూపు ఎటువైపు?
మహాభారతంలోని కురుక్షేత్రం లాంటి ఎన్నికల యుద్ధం ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే రాబోతోంది. ఇక సర్వశక్తులు ప్రస్తుతం రెండు వైపులా మోహరించబోతున్నాయి. ఇక ఇప్పుడు చిరంజీవి గారు కృష్ణుడు లాంటివారు ఇక మీ పాదాల దగ్గర కూర్చునేది ఎవరు? తల దగ్గర కూర్చునేది ఎవరు? మీ చూపు ఎవరి మీద పడబోతోంది? మీ మెగా సైన్యం ఎటు ఉండబోతుంది? అనే ప్రశ్నలకు మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

మెగాస్టార్ సమాధానం
నేను అయితే ఎక్కడ కూడా పడుకోవడం లేదు. చాలా వరకు నా పనులతో పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే ఈసారి నేను ఎక్కడ కూడా ఎవరికి సారథ్యం వహించడం లేదు. ఇక తమ సైన్యానికి కూడా ఎలాంటి దిశా నిర్దేశం ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేయను. నా సినిమాలు చూడండి అని చెబుతాను. అంతేకాకుండా నన్ను బిజీగా ఉంచండి అని కూడా చెబుతాను. తప్పితే పొలిటికల్ గా ప్రస్తావించే ప్రయత్నం చేయను.. అని మెగాస్టార్ కుండబద్దలు కొట్టేశారు.

సపోర్ట్ ఎవరికంటే..
ఒకవైపు వైఎస్ జగన్ తో పాటు మరొకవైపు మీ సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోరాహోరీగా పోటీ పడబోతున్నారు. ఈ సమయంలో మీ చూపు ఎక్కడవైపు ఉంటుంది అని అడిగినప్పుడు మెగాస్టార్ కూడా చాలా సున్నితంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను కూడా ఈ సమయంలో ప్రేక్షకుడిగా చూడమే తప్ప ఏమి చేయడం లేదు.

నా అవసరం నీకు లేదురా!
ఒక విధంగా సోదర భావం ఉండవచ్చు కానీ ప్రారంభ రోజుల్లో మాత్రం ఇప్పుడు ఉన్న మెగా హీరోలకు తాను చేయి పట్టుకుని నడిపించిన వాడిని.. కానీ ఇప్పుడు వారు పరిగెత్తే స్థాయికి వచ్చారు. కానీ వారు ఎటువైపు వెళ్తారు అనే నిర్ణయం వారిదే ఇక వారి నిర్ణయం ప్రకారం నేను చూడడమే తప్ప ఏది ఆశించను. ఇక అన్నయ్య ఒకసారి చెయ్యి పట్టి నడిపించు అంటే.. నా అవసరం నీకు లేదురా! అని అంటాను.. అని పవన్ కళ్యాణ్ గురించి మెగాస్టార్ వివరణ అయితే ఇచ్చేశారు.