For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  God Father Teaser: మెగాస్టార్ కు అసలైన ఎలివేషన్.. బాసులకే బాస్.. సల్మాన్ ఎంట్రీతో హై వోల్టేజ్!

  |

  సోమవారం రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక ఒక రోజు ముందుగానే గాడ్ ఫాదర్ సినిమా టీజర్ కూడా ఆడియన్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చింది. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు టీజర్ ఆ అంచనాల స్థాయిని మరింత పెంచేసింది. ఇక టీజర్ ఎలా ఉంది అని వివరాల్లోకి వెళితే..

  టీజర్ అదిరింది.

  టీజర్ అదిరింది.

  20 ఏళ్ళు కనిపించని అతను సడన్ గా ఆరేళ్ళ లోపే జనంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తీ అంటూ.. మెగాస్టార్ ఎంట్రీని హైలెట్ గా చూపించారు. ఇక మరోవైపు హీరోయిన్ నయనతార అతన్ని చూడాలని అనుకోవడం లేదని అంటుంది. మరోవైపు రాజకీయ నాయకుడిగా సత్యదేవ్ అతన్ని చంపేయాలని అనడం మరింత హైలెట్ గా ఉంది.

   సల్మాన్ ఎంట్రీ

  సల్మాన్ ఎంట్రీ

  ఇదే తరుణంలో మెగాస్టార్ ఎంట్రీ వన్ ఆండ్ ఓన్లీ గాడ్ ఫాదర్ అని ఎలివేట్ చేశారు. ఇక సల్మాన్ ఖాన్ నీ చోటే భాయ్ ఎప్పుడు పిలిచినా వస్తాడు అంటూ బైక్ పై రావడం మాములుగా లేదు. దానికి తోడు మెగాస్టార్ వేయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్ అని చెప్పడంతో సినిమాలో వీరి సీన్స్ మామూలుగా ఉండవని అనిపిస్తోంది. మొత్తానికి యాక్షన్ ఎలివేషన్స్ తో సినిమా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆదరగొట్టేశాడు.

   లుక్ తోనే భారీ హైప్

  లుక్ తోనే భారీ హైప్


  మెగాస్టార్ చిరంజీవి విభిన్నమైన సినిమాలలో అభిమానులతో అంచనాలను పెంచే విధంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే ఎక్కువగా గాడ్ ఫాదర్ సినిమా పైనే ఉంది. ఇది వరకే మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్నటువంటి లూసిఫార్ సినిమాకి రీమేక్ గా రాబోతున్న గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ ఎంత కొత్తగా కనిపిస్తారు అనేది ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే అంచనాలను పెంచేసింది. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ డ్రెస్ లో అలాగే డిఫరెంట్ లుక్కుతో అభిమానులకు కిక్ అయితే ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీజర్ కూడా వచ్చేసింది

  హై విజువల్స్

  హై విజువల్స్


  మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో తన లుక్స్ తోనే ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఇక ఆయన ఈసారి ఒక మిడ్ ఏజ్ పర్సన్ చాలా రఫ్ లుక్కుతో కనిపించబోతున్నట్లుగా అర్థమవుతుంది. సినిమాలో గతంలో ఎప్పుడు లేని విధంగా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజువల్స్ కూడా అద్భుతంగా ఉండబోతున్నట్లు టీజర్ తో క్లారిటీ ఇచ్చేశారు.

  స్పెషల్ సాంగ్

  స్పెషల్ సాంగ్

  మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గాడ్ ఫాదర్ టీజర్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటుంది అని ఆడియన్స్ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. సినిమాలో సల్మాన్ ఖాన్ మెగాస్టార్ కాంబినేషన్లో రాబోయే సాంగ్ కూడా హైలెట్ కాబోతోంది. ఆ సాంగ్ కు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు.

  వరల్డ్ వైడ్ రిలీజ్

  గాడ్ ఫాదర్ విడుదల తేదీపై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్లో దసరా సందర్భంగా విడుదల చేయబోతున్నారు. పోటీగా మరికొన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి విడుదల తేదీ విషయంలో అయితే ఎలాంటి మార్పు లేదు అని తెలుస్తోంది. అసలైతే అంతకంటే ముందే సమ్మర్లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మధ్యలో కాస్త షూటింగ్ ఆలస్యం కావడంతో ఇప్పుడు అక్టోబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

  English summary
  megastar chiranjivi God father official telugu teaser
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X