Mehreen Pirzada షాకింగ్ ప్రకటన.. భవ్య భిష్ణోయితో బ్రేకప్, అతనితో ఎలాంటి సంబంధం లేదంటూ!

తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న మెహ్రీన్ కౌర్ పిర్జాదా ఎవరూ ఊహించని షాక్ ఇచ్చింది. పంజాబ్ కు చెందిన ఈ భామ ఈ మధ్య కాలంలోనే ఒక రాజకీయ నాయకుడి మనవడితో ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ముందు పెళ్లి వాయిదా వేసుకున్నట్టు ప్రకటించిన ఆమె ఇప్పుడు ఏకంగా రద్దు అంటూ ప్రకటించి షాక్ ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

నానితో హీరోయిన్ గా

నానితో హీరోయిన్ గా

పంజాబ్ లోని ఒక సాంప్రదాయ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మెహ్రీన్ పిర్జాదా తెలుగులో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నాని సరసన హీరోయిన్ గా నటించి మొదటి సినిమాతోనే హిట్ అందుకుని మంచి పేరు దక్కించుకుంది. ఆ దెబ్బకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. ఆమె రెండో సినిమా మహానుభావుడు కూడా సూపర్ హిట్ అయింది.

వరుస అవకాశాలు

వరుస అవకాశాలు

అలాగే ఆ తర్వాత చేసిన రాజా ది గ్రేట్ కూడా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు తెలుగు సహా తమిళ భాషల్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. ఇక తర్వాత అన్ని డిజాస్టర్ సినిమాలు ఎదురు కావడంతో పెద్దగా అవకాశాలు అయితే దక్కడం లేదు. చివరిగా అశ్వత్థామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్2 అనే సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమాలో ఈ భామ హనీ అనే పాత్రలో నటిస్తోంది.

పెళ్ళికి రెడీ

పెళ్ళికి రెడీ


ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఈ భామ పెళ్లికి సిద్ధం అయిపోయింది. గత కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న ఆమె సైలెంట్ గా హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు ప్రస్తుత ఆదం పూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో పెళ్ళికి సిద్దం అయింది. మార్చి నెల 13వ తేదీన రాజస్థాన్ లోని జైపూర్ అలీల కోటలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

వాయిదా పడిందనుకున్నా

వాయిదా పడిందనుకున్నా

అయితే ఈ ఏడాదిలో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని భావించినా ముందు పెళ్ళి వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడిందని అన్నారు, కానీ భవ్య బిష్ణోయి తాను తమ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నామని, పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నామని షాపింగ్ ప్రకటన చేసింది మెహ్రీన్ పిర్జాదా. ఈ నిర్ణయాన్ని ఇద్దరం కలిసి తీసుకున్నామని ఆమె వెల్లడించింది..

వాళ్లతో సంబంధం లేదు

వాళ్లతో సంబంధం లేదు

గుండెలోతుల్లో నుంచి ఎంతో గౌరవంతో చెబుతున్నానన్న ఆమె ఇకమీదట భవ్య బిష్ణోయితో కానీ ఆయన కుటుంబ సభ్యులతో కానీ ఆయన స్నేహితులతో కానీ తనకు ఎలాంటి సంబంధం ఉండదని ఆమె వెల్లడించింది. ఇక ప్రతి ఒక్కరూ తన ప్రైవసీ ఈ విషయంలో స్వేచ్ఛ ఉందని భావిస్తారు అని తెలిసే ఈ స్టేట్మెంట్ విడుదల చేస్తున్నా అని, ఇది తన ప్రైవేట్ మేటర్ గా భావించి ఇక ఈ విషయాన్ని వదిలేయాలి అని కోరింది.

అందులో తగ్గేది లేదు

అందులో తగ్గేది లేదు


ఇక తన వృత్తి విషయానికి వస్తే తాను సినిమాల్లో నటించడం మానేయనని, తన ఫ్యూచర్ ప్రాజెక్టులలో కూడా తన నుంచి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని ఆమె చెప్పుకొచ్చింది.. నిజానికి మెహరీన్ హైదరాబాద్ లో జరుగుతున్న ఎఫ్ త్రీ షూటింగ్ లో తాజాగా జాయిన్ అయింది. ఇంతలోనే పెళ్లి రద్దు చేస్తున్నట్లు గా ప్రకటించడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే వారిద్దరి మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా ? లేక కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయా ? అనే విషయం మాత్రం క్లారిటీ లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X