Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చంద్రబాబును కలిసిన మోహన్ బాబు, లక్ష్మీ మంచు.. రూమర్లకు తెరదించిన డైలాగ్ కింగ్
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నటుడు మోహన్ బాబు మంచు, తన కూతురు లక్ష్మి మంచుతో కలిసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కలవడం రాజకీయ వర్గాల్లోను, సినీ వర్గాల్లోను చర్చనీయాంశమైంది. చంద్రబాబు,మోహన్ బాబు భేటి నేపథ్యంలో మీడియాలో అనేక రూమర్లు స్వైర విహారం చేశాయి. అయితే వీరి సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఉందనే ఊహాగానాలు మీడియాలో కనిపించాయి. ఈ భేటి వెనుక వివరాలను మోహన్ బాబు వెల్లడించి రూమర్లకు తెరదించే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
గురువారం అంటే జూలై 26వ తేదీన మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు నివాసానికి మోహన్ బాబు వెళ్లడం ఆసక్తిని రేపింది. అయితే తిరుపతికి సమీపంలోని తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ఆవరణలో సాయిబాబా ఆలయం నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వనించేందుకు తన కూతురు లక్ష్మి మంచుతో కలిసి మోహన్ బాబు వెళ్లారు. ఆహ్వాన పత్రికను అందజేసి సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని కోరారు.

చంద్రబాబును కలిసిన తర్వాత మీడియాకు మోహన్ బాబు ఓ ప్రకటనను జారీ చేశారు. శ్రీ విద్యానికేతన్ సమీపంలో నిర్మించిన సాయిబాబా గుడి విగ్రహ ప్రతిష్టాపన ఆగస్టులో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు మాత్రమే కలిశాను. మా భేటి వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు అని మోహన్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
సాయిబాబా గుడి నిర్మాణ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఆన్‌లైన్ ద్వారా స్వచ్ఛందంగా భక్తుల నుంచి విరాళాలు స్వీకరించారు. దాతలు ఎవరైనా విరాళాలు అందించాలంటే..ఆన్ లైన్ ద్వారా అందించవచ్చని ఇటీవల మోహన్ బాబు తెలిపారు.