twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంపీ కవిత చేతుల మీదుగా విమెన్‌ ఆఫ్‌ రిథమ్‌ పోస్టర్‌

    |

    మహిళా వాద్యకారుల ప్రతిభని గుర్తించడానికి, గౌరవించడానికి 'విమెన్‌ ఆఫ్‌ రిథమ్‌' అనే కాన్సెప్ట్‌తో కాన్సర్ట్‌ సిరీస్‌ సంగీత కచేరి నిర్వహిస్తున్నది. ఈ సంస్థ దేశంలో మహిళా సాధికారత కోసం పాటుపడుతున్నది. కళలు, సంప్రదాయాలను ప్రోత్సహించే టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇటీవల హైదరాబాద్‌ కాన్సర్ట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. మహిళా కళాకారులను ప్రొత్సహిస్తున్నందుక బ‌ందాన్ని ఆమె అభినందించారు.

    'విమెన్‌ ఆఫ్‌ రిథమ్‌' మొదటి 3 సీజన్స్‌లో దేశంలోని ప్రముఖ మహిళా పెర్క్యూసన్‌ వాద్యకారులలో 20 మంది పలు కచేరీలలో తమ ప్రతిభ ప్రదర్శించారు. డ్రమ్స్‌లో అనన్య పాటిల్‌, ఘటంలో సుకన్య రామగోపాల్‌, మహీవా ఉపాధ్యాయ్‌, సవని తల్వాల్కర్‌, పఖవజ్‌ మరియు తబలా, చారు చైల్డ్‌ ప్రాడిజీ రాహితా, చందా లాంటి అనేక మంది ఇందులో పాల్గొన్నారు.

    MP Kalvakuntla Kavitha releases Women of Rythm poster

    మార్చి 10, సాయంత్రం 7 గంటల నుంచి సిసిఆర్‌టి అంఫి థియేటర్‌, మాదాపూర్‌లో జరిగే 4వ ఎడిషన్‌లో అత్యుత్తమ మహిళా సంగీతకారులు పాల్గొంటారు. విజయవాడకు చెందిన దండమూడి సమ్మతి రామమోహరావు మ‌ృదంగం, సుకన్య రామ్‌గోపాల్‌ ఘటం, మిథాలి ఖర్గోవన్కర్‌ తబలా, డెబోప్రియ రణదీవ్‌ ఫ్లూట్‌, చందనా బాల గాత్రంతో హైదరాబాద్‌ ప్రేక్షకులను సమ్మోహనపర్చనున్నారు.

    MP Kalvakuntla Kavitha releases Women of Rythm poster

    'విమెన్‌ ఆఫ్‌ రిథమ్‌' సీజన్‌ 4ను ఎలెవెన్‌ పాయింట్‌ టూ సంస్థ హోస్ట్‌ చేస్తోంది. 'ఎలెవెన్‌ పాయింట్‌ టూ' ఇంతకుముందు ఇళయరాజా, శోభన, కెజె ఏసుదాస్‌ ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించింది. హైదరాబాద్‌కి చెందిన 'మోటివిటీ ల్యాబ్స్‌'తో కలిసి 'ఎలెవన్‌ పాయింట్‌ టూ' ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.. ఎటువంటి ఎంట్రీ ఫీ లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.

    English summary
    MP Kalvakuntla Kavitha releases Women of Rythm poster which support Women empowerment. This musical concert is conding by Eleven point two and Concert Series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X