Don't Miss!
- News
టర్కీలో తీవ్ర భూకంపం.. నిముషాల వ్యవధిలో రెండుసార్లు; రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు!!
- Sports
INDvsAUS : వాళ్లకు కూడా గాయాలైతే సిరీస్ ముగిసినట్లే.. ఆసీస్ టెస్టులపై పేలుతున్న మీమ్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
డైరెక్టర్ రాజమౌళి ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ కు మాతృవియోగం!
రాజమౌళి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా ఆరాధించే కీరవాణి మాతృమూర్తి కన్నుమూశారు. దీంతో వారి కుటుంబం మొత్తం కూడా ఒకసారిగా షాక్ కు గురైంది. రాజమౌళి కీరవాణి కుటుంబం మొత్తం కూడా ఒకే దగ్గర ఉంటారు. ఎంతో కాలంగా వారు ఉమ్మడి కుటుంబం గా జీవిస్తున్న విషయం తెలిసిందే. ఇక అందరికంటే వారి ఫ్యామిలీలో ఇంటికి పెద్ద కుమారుడైన ఎంఎం.కీరవాణిని రాజమౌళి పెద్దన్నయ్య అనే ప్రేమగా పిలుస్తూ ఉంటాడు.
మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతగానో గుర్తింపును అందుకున్న కీరవాణి ఫ్యామిలీ లో అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి తండ్రి కే.శివదత్త కూడా కొన్ని సినిమాలకు పాటల రచయితగా వర్క్ చేశారు. అయితే కీరవాణి మాతృమూర్తి ఇటీవల కొంత అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఆమె మెల్లగా కోరుకుంటున్నారని అనుకుంటున్న తరుణంలోనే కన్నుమూసినట్లుగా తెలుస్తోంది.

కీరవాణి మాత్రమే కాకుండా వారి తల్లిని రాజమౌళి అలాగే మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. ఇక ఇంటికి పెద్ద తల్లిగా ఉన్నటువంటి కీరవాణి మాతృమూర్తి మరణించడంతో ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ విషయం గురించి తెలియగానే సినిమా ప్రముఖులు కీరవాణి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా కీరవాణి తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాట్లు గా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇటీవల RRR సినిమాకు సంబంధించి కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఆనందం వచ్చిన కొన్ని గంటలకే ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం అందరిని కలిచి వేసింది. ఇక ఆయన ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.