వరుణ్ తేజ్ హీరో అవ్వాలని కోరుకోలేదు.. బాత్రూమ్‌లు కడిగిస్తేనే వారి విలువ తెలుస్తుంది: నాగబాబు

టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుంచి నటీనటులు ఎంతమంది పరిచయమైన కూడా చివరికి వారి టాలెంట్ తోనే ఒక పటిష్టమైన మార్కెట్ ని సెట్ చేసుకుంటున్నారు. ఇక నాగబాబు హీరోగా సక్సెస్ కాకపోయినప్పటికి తన స్టైల్ ని మార్చి ఆడియెన్స్ కి నచ్చేలా సపోర్టింగ్ రోల్స్ చేసి సక్సెస్ అయ్యారు. ఇక పొలిటికల్ గా కూడా అడుగులు వేసిన మెగా బ్రదర్ అన్ని రకాల సమస్యలపై స్పందిస్తున్నాడు. ఇక ఇటీవల పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉండాలనే దానిపై వివరణ ఇచ్చాడు.

మరో కొత్త అంశంతో నాగబాబు

మరో కొత్త అంశంతో నాగబాబు

సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నప్పటి నుంచి కూడా నాగబాబు ఎన్నో సామాజిక అంశాల గురించి మాట్లాడారు. అలాగే లైఫ్ స్టైల్ పై కూడా పలు ఉదాహరణలతో ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. డబ్బుపై నగబాబు ఇచ్చిన వివరణ అప్పట్లో ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

పిల్లలను అలా నిరుత్సాహపరచకూడదు

పిల్లలను అలా నిరుత్సాహపరచకూడదు

ఇక పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రుల ఆలోచన విధానం కరెక్ట్ గా ఉండాలని అన్నారు. పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలను నిరుత్సాహపరచకూడదు. వెన్నుతట్టి ఉంటే వారు ఏదైనా సరే ఇష్టంగా కష్టపడతారు. అంతేగాని ఒక మాట ద్వారా ఫీల్ అయ్యేలా చేయకూడదు. మళ్ళీ అనేసి ఆ తరువాత ఈ మాత్రానికే ఫీల్ అవ్వాలా అనేది కూడా చాలా అనవసరం.

వరుణ్... పోలీస్ అవ్వాలని అనుకున్నాను

వరుణ్... పోలీస్ అవ్వాలని అనుకున్నాను

నా కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారిక విషయంలో నేను వారి నిర్ణయాలను తప్పుబట్టలేదు. ముందుగా వరుణ్ ని ఒక పొలిసాఫీసర్ గా చూడాలని అనుకున్నాను. నిహారిక డాక్టర్ అవ్వాలని చిన్నప్పుడే కోరుకున్నాను. కానీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీవైపే ఇంట్రెస్ట్ చూపించారు. వారి మాటకు విలువ ఇవ్వాలి.. అని తెలిపారు.

Recommended Video

Corona Birth Anniversary: కరోనాను భయపెట్టేసిన రవిబాబు... Ravi Babu Reacts
రెండు బాధ్యతలు తప్పనిసరి

రెండు బాధ్యతలు తప్పనిసరి

ఇక పిల్లలకు తప్పకుండా రెండు బాధ్యతలు ఇవ్వాలి అంటూ వాళ్ళ రూమ్ తో పాటూ, బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి. అప్పుడే వారికి పని మనుషుల యొక్క విలువ తెలుస్తుంది. ఇక పిల్లలు ఎవరి మీద ఆధారపడకుండా జీవించే శక్తి ఏర్పడుతుంది. . అంటూ నాగబాబు వివరణ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లిని గ్రాండ్ గా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి వేడుకలన్ని ముగిసిన తరువాతనే నాగబాబు మళ్ళీ రెగ్యులర్ శుటీంగ్ లతో బిజీ కానున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X