108 సార్లు ఆ మంత్రం చదివితే కరోనా పరార్.. వైరస్‌ను తరిమికొట్టే చిట్కా చెప్పిన బాలకృష్ణ
నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి మానవత్వానికి చాటుకొన్నారు. ఏపీలో కరోనావైరస్ పరిస్థితులు విలయతాండవం చేస్తున్న సమయంలో తన నిజయోజకవర్గం హిందూపూర్ హాస్పిటల్‌కు రూ.55 లక్షల విలువ చేసే కొవిడ్ వైద్యపరికరాలు, మెడిసిన్స్‌ను బాలకృష్ణ ప్రకటించారు. ఐదు నెలల తర్వాత హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన ప్రజలకు మందుల పంపిణీ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం నా గుండె చప్పుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

ప్రజాసేవ కోసం ఎల్లప్పుడూ సిద్ధం
హిందూపూర్ ఆసుపత్రికి రూ.55 లక్షల విలువ చేసే కొవిడ్ వైద్యపరికరాలు, మందులను బాలకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే 100 ఆక్సిజన్ మీటర్లు, 5 స్టెచ్చర్లు, ఒక ఎక్సరే మిషన్, హాస్పిటళ్లకు పరికరాలు, మందులను అందిస్తున్నాం అని చెప్పారు. ప్రజల కోసం ఎలాంటి సేవల చేయడానికైనా సిద్ధం అని బాలయ్య తెలిపారు.

దేవుళ్లు ఎందుకు కనిపించడం లేదంటే..
దేవాలయాల్లో దేవుళ్లు కనిపిచడం లేదు. దేవుళ్లందరూ డాక్టర్లు, నర్సుల రూపంలో హాస్పిటల్‌లో కనిపిస్తున్నారు. కరోనావైరస్‌ను అరికట్టేందుకు దేవుళ్లుగా వైద్యులు సేవలందిస్తున్నారు. కులాలకు, మతాలకు అతీతంగా వైద్యులు సేవలందిస్తూ ప్రజల ప్రశంసలు అందుకొంటున్నారు అని నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.

108 సార్లు మంత్రం చదివితే..
వేదాల్లోని మంత్రాలకు కరోనావైరస్ నివారించే శక్తి ఉంది. మందులతోనే కాకుండా వేదాల్లోని మంత్రాలతో కూడా వైరస్‌కు అడ్డుకట్ట వేద్దాం. లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని చదివితే కరోనాను పారద్రోలవచ్చు. ఈ మంత్రాన్ని 108 సార్లు చదివితే కరోనా సోకదని బాలయ్య చెప్పారు.

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన స్థానం
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన సాక్ష్యం ఉంది. నా తండ్రి ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించడానికి ప్రేక్షకులు కారణమయ్యారు. బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా తెలుగు సినిమా పరిశ్రమ సత్తా చాటుతుంది. మన సినిమాలు హిందీ భాషల్లోకి డబ్బింగ్ అవుతూ టెలివిజన్ ఛానెళ్లలో మంచి ప్రేక్షకాదరణకు గురి అవుతున్నాయి. చరిత్ర రాయాలన్నా.. సృష్టించాలన్నా మనమే అని బాలకృష్ణ అన్నారు.
Recommended Video

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు చేయూత
కరోనా పరిస్థితులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కోటి రూపాయల విరాళం కూడా అందించారు. అలాగే సినీ కార్మికులను ఆదుకొనేందుకు కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కోసం 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తన హిందూపూరం నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం తీసుకొన్న నిర్ణయంపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications











