బాలీవుడ్ లో మంట పెట్టేసిన బాలయ్య.. 50 ఏళ్ళ కెరీర్ లో మొదటిసారి ఇలా
నందమూరి నట సింహం, టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసు దాటినా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గానే ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ దుమ్ము లేపుతున్నాను. ఇంట్రెస్టింగ్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బాస్టర్ హిట్స్ ను సొంతం చేసుకుంటున్నారు. అంతేకాదు యంగ్ హీరోలకు దీటుగా యాక్షన్ చిత్రాలతో అదరగొడుతున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ నుంచి రాబోయే చిత్రాలపై ఆసక్తికరమైన అప్డేట్ అందింది. అది కూడా బాలకృష్ణనే చెప్పడం విశేషం.
బాలకృష్ణ కెరీర్లో అఖండ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే ఈ సినిమాకు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించడం విశేషం. 2021 డిసెంబర్ 2న అఖండ శిఖరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఘోరగా బాలయ్య పర్ఫామెన్స్ కు ఫిదా అయ్యారు. దీంతో బోయపాటి శ్రీనివాస్ వెంటనే అఖండ 2 చిత్రాన్ని ప్రకటించారు. అప్పటినుంచి ఈ చిత్రం ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు అఖండ 2 చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకొని ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఇప్పటికే అఖండ 2 చిత్రం నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదలై భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. బాలకృష్ణ అఘోరా లుక్, యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్, బిజిఎం విషయంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇక దీంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకుప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ లో ఉన్నారు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ టెక్నికల్ విషయాల వల్ల, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ద్వారా మరింత బెస్ట్ అవుట్ పుట్ ని అందించేందుకు కాస్త సమయం పడుతుందని అందుకే సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా అఖండ 2 చిత్రం గురించి నందమూరి బాలయ్య ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేస్తూ ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే తెలుగు వెర్షన్ డబ్బింగ్ పూర్తయిందని, తాజా హిందీ వెర్షన్ డబ్బింగ్ కూడా నేనే చెప్పానని బాలయ్య రివ్యూ చేశారు. అయితే బాలకృష్ణ సినిమాల్లో అభిమానులు ఎక్కువగా ఆశించేది డైలాగ్స్, యాక్షన్ సీన్లు మాత్రమే. అయితే అఖండ 2 చిత్రంలో ఆ రెండింటికి కొదవలేదు. దానికి తోడు బాలయ్య తన సొంత వాయిస్ లో డబ్బింగ్ చెప్పడంతో థియేటర్లలో గూస్ బంప్స్ ఖాయం అని అంటున్నారు.
ఇప్పటికే నార్త్ ఇండియాలో సౌత్ చిత్రాలు, ముఖ్యంగా తెలుగు చిత్రాలు సెన్సేషన్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో అఖండ 2 చిత్రం తెలుగుతోపాటు, హిందీ భాషలోనూ భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అలాగే తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఇందులో తెలుగు హిందీకి మాత్రం బాలయ్య డబ్బింగ్ చెప్పడం విశేషంగా మారింది. ఇక అక్కడ 2లో డైలాగ్స్ తూటాలు అనుబంలా పేలుతాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











