గోపీచంద్‌కు బాలకృష్ణ సలహాలు: వెంటనే ఆచరణలో పెట్టిన యంగ్ డైరెక్టర్

ఆరు పదుల వయసులోనూ నటసింహా నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. చాలా కాలంగా హిట్ దొరకక ఇబ్బందులు పడుతోన్న ఆయన.. రిజల్ట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో ఎన్నో పరాజయాలను చవి చూశారు. అయినప్పటికీ ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించకుండా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో నటసింహా ఓ సినిమాను చేయబోతున్నారు. తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ ఏడాది ఆరంభంలోనే 'క్రాక్' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు గోపీచంద్ మలినేని. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే నందమూరి బాలకృష్ణకు కథ చెప్పగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఇది పట్టాలపైకి ఎక్కబోతుంది. తాజా సమాచారం ప్రకారం.. గోపీచంద్‌ చెప్పిన కథలో కొన్ని మార్పులు చేయాలని కోరారట బాలయ్య. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌తో పాటు కొన్ని ఎపిసోడ్స్‌లో మార్పులు సూచించారట. దీంతో వెంటనే సదరు దర్శకుడు వాటిని కొత్తగా డిజైన్ చేసే పనిని ప్రారంభించేశాడని టాక్.

Nandamuri Balakrishna Wants Changes in Gopichand Malineni Story

ప్రస్తుతం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ఇది వచ్చే నెలలో పూర్తి కాబోతుంది. దీని తర్వాతనే గోపీచంద్ సినిమాను ఆయన పట్టాలెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథను రెడీ చేశాడీ యంగ్ డైరెక్టర్. పల్నాడు నేపథ్యంతో సాగే ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతుందట. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X