Don't Miss!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
నందు విశ్వరూపం, రష్మీ రొమాంటిక్ టచ్.. బొమ్మ బ్లాక్‌బస్టర్ టీజర్ రచ్చ
రిలీజ్‌కు ముందే ఓ చిన్న సినిమా జనాలకు బాగా కనెక్ట్ అవ్వడం, పది మంది నోళ్లల్లో నానడం అంటే మామూలు విషయం కాదు. చిన్న సినిమాలు కంటెంట్ నిరూపించుకునేంత వరకు ఎవ్వరూ కూడా వాటిని పట్టించుకోరు. కానీ బిగ్‌బాస్ షో హడావిడి పుణ్యమా అని, నందు ప్లే చేసిన స్ట్రాటజీ వల్ల బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజీగా మారిపోయింది. నందు తన కొత్త ప్రాజెక్ట్.. బొమ్మ బ్లాక్‌బస్టర్ గురించి అప్డేట్ ఇచ్చేందుకు BB అని వాడాడు. అయితే అందరూ BB అంటే బిగ్‌బాస్ అనుకున్నారు.
BB అంటే అంతా బిగ్ బాస్ అనుకున్నారు బిగ్‌బాస్ హౌస్‌లోకి నాల్గో సీజన్ కంటెస్టెంట్‌గా నందు వెళ్లబోతోన్నాడని అందరూ అనుకున్నారు. రూమర్లు కూడా బాగానే వచ్చాయి. వాటినే నందు క్యాచ్ చేశాడు. అయితే BB అంటే తన కొత్త ప్రాజెక్ట్ అని బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఇందులో రష్మీ వాణి పాత్రను పోషించింది. ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ ఓ రేంజ్‌లో హల్చల్ చేసింది.


తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ బయటకు వచ్చింది. శ్రీ విష్ణు వాయిస్ ఓవర్‌లో ఈ టీజర్ ఆద్యంతం అద్భుతంగా ఉంది. పూరి జగన్నాద్ అభిమానిగా పోతురాజ్ పాత్రలో నందు అదరగొట్టేశారు. రా లుక్‌లో నందు తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఇక రష్మీ తనలోని కొత్త యాంగిల్‌ను చూపెట్టబోతోందని తెలుస్తోంది. నందు రష్మీల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. ఈ మూవీని విజయీభవ ఆర్ట్స్‌పై నిర్మిస్తుండగా.. రాజ్ విరాట్ తెరకెక్కిస్తున్నాడు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందిస్తున్నాడు.