Just In
- 3 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 4 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 5 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 6 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- News
Inauguration Day 2021: రేపే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సీక్రెట్ చెప్పిన నాని.. పదేళ్ల క్రితమే అమ్మాయితో లవ్.. నేటికీ కంటిన్యూ!
ప్రతీ వ్యక్తి జీవితంలో కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. అవి మన నోటి నుంచే ఎప్పుడు ఎలా బయటకొస్తాయో ఊహించలేం. తాజాగా నాని విషయంలో అదే జరిగింది. తన ప్రేమ సంగతిని తానే స్వయంగా, అదీ పబ్లిక్‌గా చెప్పేశారు నాని. వివరాల్లోకి పోతే..

గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
నాని హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'గ్యాంగ్ లీడర్'. ప్రస్తుతం ప్రమోషన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్బంగా నిన్న (సెప్టెంబర్ 10 న) వైజాగ్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు నాని సహా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. అయితే స్టేజీపై మాట్లాడిన నాని.. కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.
ఆ ధైర్యం ఎప్పుడూ చేయం.. ఒక్కసారైనా మెగాస్టార్‌తో షేర్ చేసుకోవాలని ఉంది.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు

పదేళ్ల క్రితమే ప్రేమ
తాను పదేళ్ల క్రితమే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డానని, ఆ అమ్మాయిది వైజాగే అని చెప్పాడు నాని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఈ సిటీతో లవ్‌లోనే ఉన్నానని ఆయన పేర్కొన్నారు. వైజాగ్ ఓ అందమైన ప్రదేశమని, ఇంతకంటే అందమైన ప్లేస్ ప్రపంచంలో ఎక్కడా ఉండదని చెబుతూ వైజాగ్ ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు నాని. వైజాగ్ తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు.

నా కెరియర్ ఇక్కడే బిగిన్ అయింది
తన 'అష్టా చెమ్మా' సినిమాకి మూడు రోజుల ముందు స్పెషల్ ప్రీమియర్ షో ఇక్కడే జరిగిందని గుర్తు చేసిన ఆయన.. తన కెరియర్ ఇక్కడే బిగిన్ అయ్యిందని తెలిపారు. ఈ 11 సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియదు.. మళ్లీ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాకి మూడు రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు.

రాబోయే 11 సంవత్సరాలు సేఫ్
సో ఈ లెక్కన రాబోయే 11 సంవత్సరాలు కూడా తాను సేఫ్ అని చెప్పారు నాని. మీ అందరి ముందు నా చిత్రయూనిట్ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. వైజాగ్‌లో ‘గ్యాంగ్ లీడర్' ఏయే థియేటర్స్‌తో విడుదలౌతుందో తెలియదు కానీ, 13 నుండి ఒక్కో థియేటర్‌లో టిక్కెట్ ముక్కకూడా దొరక్కూడదని నాని ఆసక్తికరంగా మాట్లాడారు.

గ్యాంగ్ లీడర్ మూవీ..
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్' సినిమా రూపొందింది. చిత్రంలో నాని హీరోగా నటించగా.. మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన నటించారు. Rx 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్ పోషించాడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కట్టారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.