For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pawan సర్ జెన్యూన్.. జగన్ గారూ పట్టించుకోండి... నాని సంచలన ట్వీట్

  |

  నేచురల్ స్టార్ నాని 'టక్ జగదీష్' సినిమా విడుదల విషయంలో చాలా వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. లవ్ స్టోరీ నిర్మాతలు ముందు సెప్టెంబర్ 10వ తేదీన సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు అయితే ఈ సినిమా మాత్రం అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మేశారు నాని సినిమా నిర్మాతలు. ఆ సినిమాను కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

  ఈ విషయంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తూ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు గురించి హీరో నాని స్పందిస్తూ చేసిన ట్వీట్లు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. నాని ఏమని అన్నారు? అనే వివరాల్లోకి వెళితే.

  లవ్ స్టోరీ vs టక్ జగదీష్

  లవ్ స్టోరీ vs టక్ జగదీష్

  నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్'ను ఓటిటిలో విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించక ముందే తెలంగాణ ప్రాంతాలకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. నాని మీద థియేటర్ యజమానులంతా కలిసి సీరియస్ అవుతూ ఇకపై నాని సినిమాలను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. ఒకరకంగా నాని ఏమీ చేయలేడని తెలిసినా అందరూ కలిసి నానిని టార్గెట్ చేశారు. పలు సినిమాలు ఓటిటిలో విడుదలైనా నోరు మెదలేదు కానీ నానిపై ఇలా మండిపడుతుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు.

  స్పందించిన నాని టీమ్

  స్పందించిన నాని టీమ్

  అయితే ఈ విషయంలో నాని చిత్రబృందం స్పందించి ఓటిటిలో సినిమాను విడుదల చేయడం నానికి ఇష్టం లేదని, కానీ తామే తప్పక ఆయన్ని ఒప్పించి విడుదల చేస్తున్నామని ప్రకటించారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు శాంతించి నానికి సారీ చెప్పారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో కూడా నాని స్పందిస్తూ తనపై ఇలా అనవసరంగా నోరు పారేసుకున్న వారు కూడా మావాళ్లే అని అన్నారు. 'ఒకవేళ పరిస్థితులు అన్నీ బాగుండి కూడా నా సినిమా ఓటిటిలో రిలీజ్ అయినప్పుడు ‘నా సినిమాలను నేనే బ్యాన్ చేసుకుంటా...' అంటూ కౌంటర్ ఇచ్చాడు.

  పవన్ కూడా

  పవన్ కూడా

  ఇక ‘నేనూ ఇండస్ట్రీలో ఒకడినే... కానీ ఇలా అందరూ కలిసి నన్ను వేరు చేయడం బాధగా ఉంది' అంటూ సినీ పెద్దల వ్యవహారంపై ఆవేదనను వెలిబుచ్చారు. అయితే నాని సినిమాలను బ్యాన్ చేస్తామని కొందరు డిస్ట్రిబ్యూటర్లు చేసిన కామెంట్ల గురించి నిన్న పవన్ కల్యాణ్ స్పందించారు.

  నానికి అండగా

  నానికి అండగా

  రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన పవన్ "చిత్రపరిశ్రమ అంటే ఒక్క దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు కాదు.. చాలామంది ఉన్నారు. ఈ మధ్య నాని గురించి తెగ తిడుతా ఉంటే చాలా బాధ కలిగింది నాకు అని అన్నారు. ఎందుకంటే... అక్రమాలు, అన్యాయాలు ఏం చేయలేదు అతను. ఒక సినిమా చేసుకొని విడుదల చేయడానికి థియేటర్లు లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓటిటికి వెళ్తే... థియేటర్ యజమానులు అంతా ఆ అబ్బాయి మీద పడితే అతనేం చేస్తాడు అని ప్రశ్నించారు.

  Daare Leda Team interview part 3. Real life doctor roopa Shares her life experiences In covid times
  పవన్ సార్ చెప్పింది నిజమే

  పవన్ సార్ చెప్పింది నిజమే

  ఆయన ఏం చేయగలడు మీరు వెళ్ళి వైసీపీ నాయకులతో మాట్లాడుకోండి. ఆ అబ్బాయి తప్పేం ఉంది?" అంటూ పవన్ ప్రశ్నించారు. అయితే పవన్ కామెంట్స్ గురించి ఎవరూ స్పందించక పోయినా ఇప్పుడు నాని తనకు అండగా నిలబడిన పవన్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సర్‌కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య రాజకీయ విబేధాలు గురించి పక్కన పెడితే ఆయన సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చాలా జెన్యూన్ గా మాట్లాడారు.

  దీనిపై అందరూ దృష్టి పెట్టండి.. సినిమా కుటుంబానికి చెబుతున్న వ్యక్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని, సంబంధిత మంత్రులను పరిశ్రమను కాపాడమని కోరుతున్నాను అని నాని ట్వీట్ చేశారు. ఇక నాని ఇలా పవన్ మాటలను నాని సమర్ధించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాని మీద ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు..

  English summary
  Nani responds on Pawan kalyan comments on tuck jagadish release in republic pre relase event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X