టక్ జగదీష్ టీజర్.. సాంగ్ తో అదరగొట్టిన థమన్.. నాని నెవర్ బిఫోర్ యాక్షన్

టాలెంటెడ్ యువ హీరో నాని ఎలాంటి సినిమా చేసినా కూడా డిఫరెంట్ స్టైల్ లో ఉంటుందని ఆడియెన్స్ లో ఒక మంచి నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. వీలైనంత వరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కనపెట్టి ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం మిస్సవ్వకుండా డిఫరెంట్ టచ్ ఇస్తున్నాడు. ఇక నెక్స్ట్ ఆడియెన్స్ ను టక్ జగదీష్ సినిమాతో ఎట్రాక్ట్ చేయాలని చూస్తున్నాడు.

శివ నిర్వణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. టీజర్ లో నాని లుక్ చాలా ఫ్రెష్ గా ఉంది. ప్రతి సీన్ లో టక్ జగదీష్ పాత్రను హైలెట్ చేశారు. జగపతిబాబు నాని అన్నగా కనిపించబోతున్నాడు. ఇక నాజర్ వంటి సీనియర్ నటులు కూడా ఉన్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందుతున్నట్లు అర్ధమవుతోంది. ఇక టీజర్ లో ఎలాంటి డైలాగ్ లేకుండా థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ బావుంది.

నాని యాక్షన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. రొటీన్ కథలు ఎక్కువగా చేస్తున్నారు అనే ట్యాగ్ నుంచి బయటపడడానికి నాని V లాంటి త్రిల్లర్ ను ట్రై చేశాడు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాతో రాబోతున్నాడు. నిన్ను కోరి, మజిలీ వంటి ఎమోషనల్ కథలను తెరకెక్కించిన శివ నిర్వణ నానితో మరో ప్రయోగమేదో చేస్తున్నట్లు అనిపిస్తోంది.

Nani upcoming movie tuck jagadish teaser

ఇక సినిమాను ఏప్రిల్ 24న విడుదల చేయనున్నారు. ఈ సినిమా అనంతరం నాని ఆ వెంటనే మరో ఛాలెంజింగ్ రోల్ తో స్పీడ్ పెంచేందుకు సిద్ధమయ్యాడు. అదే శ్యామ్ సింగరాయ్. ట్యాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ నాని మార్కెట్ కు మించి ఉంటుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X